డోలీ మోత.. తీరని వ్యథ
● అస్పత్రికి తరలిస్తుండగా
యువతి మృతి
మల్కన్‌గిరి: జిల్లాలోని ఖోయిర్‌పూట్ సమితి కాత్రాకుంట గ్రామానికి చెందిన సంజితా గోలారీ అనే యువతి జ్వరంతో బాధపడుతూ డోలీలో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. సంజితా కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. దీనిలో భాగంగా బుధవారం ఆమె పూర్తిగా నీరసించిపోవడంతో ఆస్పత్రికి తీసుకొని వెళ్లాలని నిర్ణయించారు. అయితే గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో అంబులెన్స్ కోసం సుమారు ఆరు కిలోమీటర్ల వరకు డోలీలో తీసుకెళ్లాల్సి ఉంది. దీంతో సంజితను డోలీలో కుటుంబ సభ్యులు తీసుకొని బయల్దేరారు. అయితే సకాలంలో ఆస్పత్రికి చేరలేకపోవడంతో ఆమె మార్గమధ్యలోనే మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.


