మల్కన్‌గిరిలో స్వచ్ఛభారత్
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో ఆదివారం ఆరో రోజు స్వచ్ఛభారత్ కర్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక మల్లికేశ్వర్ ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ఈ స్వచ్ఛతా కర్యక్రమాన్ని సాహిత్యం, పంచాయతీరాజ్, తాగునీటి సరఫరా, గృహనిర్మాణ, పర్యటకశాఖల సహకారంతో నిర్వహించారు. కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు కలెక్టర్ వేద్బర్ ప్రధన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ పౌరుడు తన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతీ మందిరం వద్ద నిర్వహించాలన్నారు. జిల్లా అభివృద్ధి శాఖ అధికారి నరేశ్ చంద్ర శబర, సంజాయ్ సర్కార్, ఉద్యోగులు పాల్గొన్నారు.
మల్కన్‌గిరిలో స్వచ్ఛభారత్


