పర్లాకిమిడి: నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో స్థానిక గజపతి స్టేడియంలో మంగళవారం జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ 2024–25ను ఎన్‌వైకే జిల్లా యువజన అధికారి అక్షయ్ భాస్కర్ నిపాణి ప్రారంభించారు. ఈ జిల్లా స్థాయి క్రీడాపోటీలకు జిల్లాలోని రాయఘడ బ్లాక్ పరశురాం గురుకుల ఉన్నత సెకండరీ పాఠశాల, కాశీనగర్ బ్లాక్ శ్రీరాం డిగ్రీకళాశాల, మోహనా, పర్లాకిమిడి ఉన్నత పాఠశాలల నుంచి 50మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. కబడ్డీ, బ్యాడ్మింటన్, స్లో సైక్లింగ్ పోటీల్లో గర్‌ల్స్ పాల్గొనగా, ఫుట్‌బాల్, రన్నింగ్ రేస్ 100 మీటర్ల బాయ్స్ పాల్గొన్నారు. రన్నింగ్ రేస్‌లో మిఖోకుమార్ ప్రథమ బహుమతి కై వసం చేసుకోగా, ద్వితీయ బహుమతి సునీల్ గెలుచుకున్నారు. అలాగే మహిళల కబడ్డీ విభాగంలో పరశురాం డిగ్రీకళాశాల విద్యార్థినులు కప్పును కై వసం చేసుకున్నట్టు పీఈటీ అల్లిబిల్లి రామారావు తెలిపారు. ఈ స్పోర్ట్స్ ఈవెంటుకు సెంచూరియన్ వర్సిటీ స్పోర్ట్స్ అధికారి ఎ.హారిచందన్, నెహ్రూ యవకేంద్రం సిబ్బంది ఎ.మహేశ్వరరావు, వి.భవానీ ప్రసాద్ తదితరులు సహకరించారు.
ఉత్సాహంగా జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్
ఉత్సాహంగా జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్