‘వాహన చట్టాలు అమలు చేయాల్సిందే’

మట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ మౌలానా   - Sakshi

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: పోలీస్‌, బీమా కంపెనీల అధికారులు మోటార్‌ వెహికల్‌ చట్టం అమెండ్‌మెంట్‌–2022ను పరిధిలోకి తీసుకుని చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ మౌలానా అన్నారు. ఆయన శుక్రవారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యాలయంలో ఈ అమెండ్‌మెంట్‌పై పోలీస్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్స్‌కు, పలు బీమా కంపెనీ ల అధికారులకు, న్యాయవాదులకు అవగాహ న సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి మాట్లాడుతూ కొత్త చట్టాలను అనుసరించి ఎవరి బాధ్యత వాళ్లు సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. వాహన ప్రమాదాల్లో కక్షిదారులకు సత్వరం న్యాయం అందించాలన్నారు.

శ్రీముఖలింగం ఆలయ హుండీ ఆదాయం రూ.4.37 లక్షలు

జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగం శివరాత్రి అనంతరం హుండీ ఆదాయం రూ. 4,37,519 వచ్చినట్లు ఆలయ ఈఓ పి.ప్రభాకరరావు శుక్రవారం తెలిపారు. ఆలయ అర్చకులు, కొమనాపల్లి సత్యసాయి సేవా సంఘం సభ్యుల సమక్షంలో ఆదాయం లెక్కించినట్లు ఈఓ తెలిపారు.

నీలమణి దుర్గ హుండీ ఆదాయం రూ.10.11 లక్షలు

పాతపట్నం: పాతపట్నంలో కొలువైన నీలమణిదుర్గ అమ్మవారి హుండీ ఆదాయం రూ. 10.11,709 వచ్చిందని ఆలయ ఈఓ టి.వాసుదేవరావు చెప్పారు. శ్రీకాకుళం దేవదాయ శాఖ సహాయ కమిషనర్‌ కార్యాలయం సీనియర్‌ అసిస్టెంట్‌ జీవీబీఎస్‌ రవికుమార్‌ పర్యవేక్షణ లో శుక్రవారం హుండీ కానుకల లెక్కింపు జరిగిందన్నారు. 84 రోజులకు గాను ఈ ఆదా యం వచ్చిందని పేర్కొన్నారు. అలాగే మార్కె ట్‌ యార్డు ఎదురుగా ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయంలో 360 రోజులకు భక్తుల కానుకల ద్వారా వచ్చిన హుండీ ఆదాయం రూ. 1,11,856లు వచ్చిందని ఈఓ తెలిపారు.

‘అనుబంధ కాలేజీలకు

నాక్‌ గుర్తింపు తప్పనిసరి’

ఎచ్చెర్ల క్యాంపస్‌: విశ్వవిద్యాలయాల అనుబంధ కళాశాలలకు నాక్‌ (నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడేషన్‌ కౌన్సిల్‌) గుర్తింపు తప్పనిసరని రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.రామ్మోహన్‌ రావు అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలోని అనుబంధ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు, అనుబంధ కళాశాలలకు నాక్‌ గుర్తింపు అంశంపై శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏడాది లోపు రాష్ట్రంలో అన్ని కళాశాలలు నాక్‌ గుర్తింపు సాధించాలని సూచించిందని అన్నారు. నాక్‌ గుర్తింపు లేకుంటే కళాశాలకు భవిష్యత్‌ ఉండదని స్పష్టం చేశారు. నాక్‌ సైతం గుర్తింపు మంజూరుకు రూ. 3.50 లక్షలు దరఖాస్తుకు వసూలు చేస్తుందని, అన్ని ప్రమాణాలు ఉంటేనే గుర్తింపు ఇస్తుందని అన్నారు. ఏ, బీ ప్లస్‌ వంటి గ్రేడులు సాధించాలంటే తప్పకుండా మౌలిక, బోధన వసతులు ఉండాలన్నారు. భవిష్యత్‌లో విద్యలో సైతం ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరిగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ సీహెచ్‌ఏ రాజే ంద్ర ప్రసాద్‌, ప్రిన్సిపాళ్లు ప్రొఫెసర్‌ బిడ్డిక అడ్డయ్య, డాక్టర్‌ ఎస్‌ .ఉదయ్‌భాస్కర్‌ పాల్గొన్నారు.

మేకల మందపై కుక్కల దాడి

ఎనిమిది పిల్లల మృతి

పాలకొండ: పట్టణంలోని ఏలాం ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున కుక్కల గుంపు దాడి చేయడంతో ఎనిమిది మేకపిల్లలు మృతిచెందాయి. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మేకల పెంపకం దారు జోలయ్య గురువారం రాత్రి తల్లి మేకలను ఒక చోట ఉంచి పిల్లలను వేరే పాకలో ఉంచారు. అర్ధరాత్రి దాటిన తరువాత కుక్కల గుంపు పిల్లలు ఉన్న పాకలోనికి చొరబడి వాటిని వెంటాడి ముక్కలు ముక్కలుగా చేశాయి. ఇంతలో వాటి అరుపులు విని వెళ్లిన జోలయ్య కుక్కల గుంపును తరిమేందుకుకు ప్రయత్నించగా ఆయనపై కూడా దాడిచేశాయి. దీంతో చుట్టుపక్కల వారిని పిలిచి కుక్కలను తరిమారు. అప్పటికే ఎనిమిది మేక పిల్లలు మృతిచెందగా మరి కొన్ని గాయాలపాలయ్యాయి. వాటికి స్థానిక పశువైద్య కేంద్రంలో చికిత్స చేశారు.

Read latest Orissa News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top