ప్రదర్శనలివే..
సుమిత్రా కళాసమితి ఆధ్వర్యంలో అరసవల్లి ఇంద్రపుష్కరణి వద్దగల వైజయంతి మండపంలో నాటిక పోటీలు జరగనున్నాయి. 25న సభా కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. మొదటిగా గుంటూరుకు చెందిన సద్గురు కళా నిలయం వారి ‘కమనీయం’ నాటిక, చిలకలూరిపేటకు చెందిన ఎమెచ్యూర్ డ్రెమెటిక్ అసోషియేషన్ వారి ‘అక్క అలుగుడు–చెల్లి సణుగుడు’ నాటిక, 26న సాయంత్రం 6 గంటలకు గుంటూరు, అభినయ ఆర్ట్స్ ‘అతీతం’ నాటిక, 7.15గంటలకు హైదరాబాదు, భూమిక థియేటర్ గ్రూప్ ప్రెజెంట్ వారి ‘బరిబత్తుల రాజు’నాటిక, 8.30గంటలకు చిలకలూరిపేట, శ్రీమద్దుకూరి ఆర్డ్స్ క్రియోషన్స్ వారి ‘మృత్యుపత్రం’ నాటిక, 27న సాయంత్రం 6గంటలకు బొరివంక,శర్వాణి గిరిజన సాంస్కృతిక సేవా సంఘం వారి ‘కొత్తపరిమళం’ నాటిక, 7.30గంటలకు విశాఖపట్నం, నటరాజ్ ఆర్ట్స్ వా ‘ది లాస్ట్ జడ్జిమెంట్’ నాటిక ప్రదర్శన జరుగుతాయి. 8.3 0గంటలకు నృత్య ప్రదర్శన, బహుమతి ప్రధానం ఉంటాయి.


