తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయొద్దు.. | - | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయొద్దు..

Jun 27 2026 1:31 AM | Updated on Jun 27 2026 1:31 AM

తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయొద్దు.. – డాక్టర్‌ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, ఆర్దోపెడిక్‌ సర్జన్‌

స్కూల్‌ బ్యాగ్‌ బరువు పిల్లల శరీర బరువులో 10 శాతం మించకూడదు. అంటే 30 కిలోల బరువున్న పిల్లవాడు 3 కిలోలకు మించి బరువు మోయడం మంచిది కాదు. రెండు భుజాలపై వేసుకునే బ్యాగ్‌ మాత్రమే ఉపయోగించాలి. బ్యాగ్‌ రెండు పట్టీలను సమానంగా బిగించి వీపుకు దగ్గరగా ఉంచాలి. బరువైన పుస్తకాలను బ్యాగ్‌లో వీపుకు దగ్గరగా అమర్చాలి. అవసరం లేని పుస్తకాలు, వస్తువులు రోజూ బ్యాగ్‌లో పెట్టకుండా పాఠశాలల్లో లాకర్‌ లేదా తరగతి గదిలో ఉంచే సదుపాయం ఉంటే ఉపయోగించాలి. పిల్లలు రోజూ కనీసం గంటసేపు ఆరుబయట ఆటలు, శారీరక వ్యాయామం చేయాలి. పిల్లలు తరచుగా వెన్నునొప్పి, మెడనొప్పి లేదా భుజాల నొప్పి గురించి చెబితే త ల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా వైద్య నిపుణుడిని సంప్రదించాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement