మేత కరువై.. పాడి బరువై | - | Sakshi
Sakshi News home page

మేత కరువై.. పాడి బరువై

Jun 27 2026 1:25 AM | Updated on Jun 27 2026 1:25 AM

● పశుగ్రాసం కొరతతో పాడిరైతులు లబోదిబో ● గణనీయంగా తగ్గుతున్న పాలదిగుబడులు ● పశువులను అయినకాడికి అమ్ముకుంటున్న యజమానులు కృత్తివెన్ను: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పాడి పరిశ్రమ ఒక కీలక ఆధారం. పంటలు ఆశించినంతగా లేకపోయినా పాడిపైనే ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ప్రస్తుతం పశుగ్రాసం కొరతతో వాటి పోషణ భారమవుతోంది. మార్కెట్లో పశుదాణా ధరలు విపరీతంగా పెరగడంతో వాటి పోషణ రైతులకు భరించలేని భారంగా మారింది. ఒకప్పుడు గ్రామాల చుట్టుపక్కల విస్తారంగా కని పించే పచ్చిక మైదానాలు ఇప్పుడు కనుమరుగై పోతున్నాయి. చెరువుల పరిసరాలు, బంజరు భూములు, ఖాళీ స్థలాల్లో పెరిగే సహజ మేత ఇప్పుడు కనిపించడం లేదు. దీంతో పశువులకు సహజ గ్రాసం పూర్తిగా తగ్గిపోయింది. ప్రత్యామ్నాయంగా పశుదాణా కొనుగోలు చేయాల్సి వస్తున్నా, పెరిగిన ధరలు రైతులకు అదనపు భారం అవుతున్నాయి. పశుపోషణ లాభసాటిగా లేక చాలామంది రైతులు పాడి పరిశ్రమకు దూరమవుతున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం 2019–20లో ఉమ్మడి జిల్లాలో 7,10,723 గేదెలు, 2,80,948 ఆవులు ఉండగా ప్రస్తుతం గేదెల సంఖ్య 6,69,773కు, ఆవుల సంఖ్య 1.50 లక్షలకు తగ్గింది. ఈ తగ్గుదల గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. పశువులకు సరిపడా పోషకాహారం అందకపోవడంతో పాల దిగుబడి కూడా తగ్గుతోంది. 2019–20 మధ్య రోజుకు 10 లక్షల నుంచి 11 లక్షల లీటర్ల పాలు సేకరించేవారు. ప్రస్తుతం రోజుకు 9 నుంచి 9.5 లక్షల లీటర్ల వరకు మాత్రమే పాల సేకరణ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పాడిరంగాన్ని కాపాడాలంటే ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పశుగ్రాసాన్ని సబ్సిడీపై అందించడం, దాణాపై రాయితీలు కల్పించడం, గ్రామాల్లో పచ్చిక మైదానాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయల్సి ఉంది. పాడిరైతులకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటి చర్యలు తీసుకుంటేనే ఈ రంగం మళ్లీ గాడిలో పడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. పాడిరైతాంగాన్ని పట్టించుకోవాలి ప్రభుత్వం పాడిరైతులను ఆదుకోవాలి. రైతులకు పశుదాణాలను అందజేయాలి. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది పాలు సగానికి సగం తగ్గిపోయాయి. పశుపోషణ చేయలేక అమ్మేస్తున్నారు.

పశుగ్రాసం కొరత వేధిస్తోంది

ఎక్కడ చూసినా పచ్చని పరక జాడే లేకుండా పోయింది. దీంతో పశువులను మేపడం తలకుమించిన భారంగా ఉంది. పాల దిగుబడి సైతం పూర్తిగా తగ్గిపోయింది. ప్రభుత్వం సబ్సిడీపై దాణాలు అందించి ఆదుకోవాలి.

పచ్చిక మైదానాలు గత జ్ఞాపకాలే

రోజురోజుకూ తగ్గుతున్న పశుసంపద

పాల ఉత్పత్తిపైనా ప్రభావం

–పిన్నెంటి పూర్ణచంద్రరావు, పాలసొసైటీ అధ్యక్షులు, గాంధీనగరం

పల్లెటూరి జీవన విధానంలో పంటలతో పాటు పాడి పరిశ్రమ కూడా ఒక భాగం. రైతుకు ఒక కన్ను వ్యవసాయమైతే రెండో కన్ను పాడిపరిశ్రమ. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా నిలిచే పాడి పరిశ్రమ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రస్తుతం సంక్షోభంలో కూరుకుపోతోంది. పశువులకు కడుపునిండా మేత దొరకని పరిస్థితి ఎదురవుతోంది. వాటిని సాకలేక.. పోషణ భారమై.. పాడి రైతులు వారి జీవనాధారమైన మూగజీవాలను తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది.

–జన్యావుల వెంకన్న, పాడిరైతు, గాంధీనగరం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement