భూములను క్రషర్ల యజమానులకే ఇవ్వాలని బెదిరింపులు. | - | Sakshi
Sakshi News home page

భూములను క్రషర్ల యజమానులకే ఇవ్వాలని బెదిరింపులు.

Jun 27 2026 1:25 AM | Updated on Jun 27 2026 1:25 AM

భూములను క్రషర్ల యజమానులకే ఇవ్వాలని బెదిరింపులు.

తమ పంట పొలాలను తక్కువ ధరకు ఇవ్వాలని లేకపోతే ఇతరులకు ఎవ్వరికీ విక్రయించినా ఊరుకునేది లేదని క్వారీల కాంట్రాక్టర్లు బెదిరిస్తున్నారని రైతులు అంటున్నారు. పాలకుల అండతో వీరు చెలరేగిపోతున్నారని వాపోతున్నారు. రాజధానికి అతి సమీపంలో ఉన్న తమ పొలాలు బయట మార్కెట్‌లో ఎకరం భూమి రూ. 2.20 కోట్ల వరకు కొనుగోలు జరుగుతున్నాయని, క్వారీ నిర్వాహకులు కేవలం ఎకరం భూమిని రూ.60 లక్షలకే ఇవ్వాలని బెదిరిస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ భూముల్లో దుమ్ము ధూళి రాకుండా చర్యలు తీసుకోవాలని పరిటాల, నక్కలంపేట, దొన బండ రైతులు అధికారులను కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement