శుక్రవారం శ్రీ 26 శ్రీ జూన్ శ్రీ 2026
ఒకటే చెత్త లారీకి రెండు సార్లు ప్రారంభోత్సవాలు
ఆటోనగర్(విజయవాడతూర్పు): ఐలా అధికారులు ఒకే లారీకి రెండుసార్లు ప్రారంభోత్సవాలు నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. గతేడాది నవంబర్ మొదటి వారంలో ఓ కంపాక్టర్ చెత్త లారీని తూర్పు ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్, ఐలా కమిషనర్ బాబ్జి ప్రారంభించారు. ఈ చెత్తలారీ (కంపాక్టర్)ను జమాక్ ముందున్న ఏపీఐఐసీ ఖాళీస్థలంలో ఎనిమిది నెలలపాటు ఉంచారు. మరలా ఇదే చెత్త లారీని స్వచ్ఛాంధ్ర చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి చేత గురువారం ఆటోనగర్ గుంటతిప్ప వద్ద పచ్చజెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఇలా ఒకే లారీని రెండుసార్లు ప్రారంభించడంపై ఇదేమి చోద్యమంటూ స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు.


