నందివాడ: మండలంలోని రుద్రపాక గ్రామంలో ఉన్న పిన్నమనేని వీరయ్య చౌదరి స్మారక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు గ్రామానికి చెందిన నలుగురు అన్నదమ్ములు రూ.10 లక్షలను విరాళంగా అందజేశారు. గ్రామంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో తమ తండ్రి కొడాలి శ్రీరాములు జ్ఞాపకార్థం ఆయన కుమారులు కొడాలి వెంకటేశ్వరరావు, కొడాలి వీరయ్య, కొడాలి శేషగిరిరావు, కొడాలి వెంకట శ్రీనివాసరావు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఐదు లక్షలు, జూనియర్ కళాశాలకు ఐదు లక్షలు చొప్పున మొత్తం రూ.10 లక్షలను చెక్కు రూపంలో మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో పిన్నమనేని వీరయ్య చౌదరి, పిన్నమనేని పూర్ణ వీరయ్య (బాబ్జి), పాలడుగు నానారావ్, తమ్మారెడ్డి శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపాల్ పి. సాల్మన్ రాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీహెచ్ సుబ్బారావు, గ్రామ ప్రముఖులు జాస్తి సాములు, శేషగిరి, నైనవరపు వెంకట కృష్ణ పాల్గొన్నారు.
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
Jun 25 2026 5:53 AM | Updated on Jun 25 2026 5:53 AM
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు బుధవారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. విజయవాడ ఆర్టీసీ కాలనీ, సాయిబాబా గుడి ప్రాంతానికి చెందిన కె. కృష్ణకుమార్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణకు అన్నదానం నిమిత్తం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ చైర్మన్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
కార్తికేయుని సన్నిధిలో
మంత్రి నారా లోకేష్ మోపిదేవి: కృష్ణాజిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని, మండలంలోని కొక్కిలిగడ్డ గ్రామంలో వెలసిన శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామివార్లను రాష్ట్ర విద్య, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ బుధవారం దర్శించుకున్నారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు బుద్దు పవన్‌కుమార్ శర్మ బ్రహ్మత్వంలో ఆలయ వేదపండితులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. అనంతరం కొక్కిలిగడ్డ ఆలయంలో అర్చకులు రామకృష్ణ దంపతులు మంత్రి లోకేష్‌కు అమ్మవారి చిత్రపటం అందించి సత్కరించారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ, ఎమ్మెల్యేలు కాగిత కృష్ణప్రసాద్, బోడే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రుద్రపాక పాఠశాల, కళాశాలకు రూ.10 లక్షల వితరణ
Advertisement


