అంకితభావంతో విధులు నిర్వర్తించండి | - | Sakshi
Sakshi News home page

అంకితభావంతో విధులు నిర్వర్తించండి

Jun 25 2026 5:53 AM | Updated on Jun 25 2026 5:53 AM

జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక

జెడ్పీలో పలువురికి ఉద్యోగోన్నతులు,

కారుణ్య నియామకాలు

చిలకలపూడి(మచిలీపట్నం): విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ ఉప్పాల హారిక అన్నారు. జిల్లా పరిషత్‌ ఆధ్వర్యంలో పలువురికి ఉద్యోగోన్నతులు, కారుణ్య నియామక పత్రాలను బుధవారం జెడ్పీ కార్యాలయంలో ఆమె అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ హయాంలో ఎంతోమందికి నిబంధనల ప్రకారం ఉద్యోగోన్నతులు, మరణించిన వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక పత్రాలు అందజేశామన్నారు. నలుగురు సీనియర్‌ అసిస్టెంట్లకు పరిపాలనాధికారులుగా, నలుగురు జూనియర్‌ అసిస్టెంట్లకు సీనియర్‌ అసిస్టెంట్లుగా, ఒకరికి రికార్డు అసిస్టెంట్‌ నుంచి టైపిస్ట్‌గా ఉద్యోగోన్నతి కల్పించామన్నారు. వివిధ హోదాల్లో ఉద్యోగం చేస్తూ మరణించిన వారి కుటుంబ వారసులను టైపిస్ట్‌, జూనియర్‌ అసిస్టెంట్లుగా నియమిస్తూ నియామకపత్రాలు అందజేశామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో జె.అరుణ, డెప్యూటీ సీఈవో ఆర్‌సీ ఆనంద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement