రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల డిమాండ్ మేరకు నర్సాపూర్ నుంచి తిరువణ్ణామలై, ఎస్‌ఎంవీటీ బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లుగా నడుస్తున్న రెండు జతల వారంతపు ఎక్స్‌ప్రెస్ రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మార్చడానికి రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. నర్సాపూర్ – తిరువణ్ణామలై (17291) వారంతపు ఎక్స్‌ప్రెస్ జూలై ఒకటి నుంచి ప్రతి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు నర్సాపూర్‌లో బయలుదేరి, గురువారం తెల్లవారుజామున 4.55 గంటలకు తిరువణ్ణామలై చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (17292) జూలై రెండు నుంచి ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు తిరువణ్ణామలైలో బయలుదేరి, శుక్రవారం మధ్యరాత్రి రెండు గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. రెండు మార్గాల్లో ఈ రైళ్లు పాలకొల్లు, విరసవరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కై కలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్‌పాడి, వెల్లూరు కంటోన్మెంట్ స్టేషన్‌లలో ఆగుతుంది.
నర్సాపూర్ – ఎస్‌ఎంవీటీ బెంగళూరు (17293) జూలై మూడు నుంచి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3.50 గంటలకు నర్సాపూర్ లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు ఎస్‌ఎంవీటీ బెంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (17294) జూలై నాలుగు నుంచి ప్రతి శనివారం ఉదయం 11 గంటలకు ఎస్‌ఎంవీటీ బెంగళూరులో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. రెండు మార్గాల్లో ఈ రైళ్లు పాలకొల్లు, విరసవరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, గూడూరు, రేణిగుంట, కాట్‌పాడి, జోలార్‌పేట్, బంగారుపేట్, కృష్ణార్జునపురం స్టేషనల్లో ఆగుతుంది.


