యోగాతో ఒత్తిడిని తగ్గించుకుందాం | - | Sakshi
Sakshi News home page

యోగాతో ఒత్తిడిని తగ్గించుకుందాం

Jun 17 2026 5:27 AM | Updated on Jun 17 2026 5:27 AM

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ

భవానీపురం(విజయవాడపశ్చిమ): మీడియా రంగంలో పని చేస్తున్న పాత్రికేయులు, ఫొటోగ్రాఫర్లు, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు నిరంతరం ఎదుర్కొంటున్న ఒత్తిడిని తగ్గించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో వృత్తిపరమైన సామరథ్యాన్ని పెంచుకునేందుకు యోగ సాధన ఎంతో అవసరమని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ అన్నారు. యోగాంధ్ర–2026లో భాగంగా మంగళవారం భవానీపురంలోని హరిత బెరంపార్క్‌లోగల పున్నమీఘాట్‌లో జరిగిన మీడియా థీమ్‌ యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులతో కలిసి యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారుల ఆర్టిస్టిక్‌ యోగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జిల్లా ఆయుష్‌ అధికారి డాక్టర్‌ వై. రత్న ప్రియదర్శిని, జిల్లా ఇంటర్మీడియెట్‌ అధికారి బి. ప్రభాకరరావు, యువజన సంక్షేమ అధికారి డాక్టర్‌ కొల్లేటి రమేష్‌, డీఎస్‌డీఓ కె. కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement