నాది బీ నెగటివ్. ఈ గ్రూపు ఎవరికి అవసరమైనా రక్తదానం చేస్తా. 2008లో దివ్య ఫౌండేషన్ ఏర్పాటు చేసిన నాటి నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తున్నా. ఇప్పటి వరకూ 49 సార్లు రక్తదానం చేశా. నేడు రక్తదాతల దినోత్సవం సందర్భంగా 50వ సారి రక్తదానం చేస్తున్నా. బైపాస్ సర్జరీలు, రోడ్డు ప్రమాదాలతో పాటు, ఇతర శస్త్ర చికిత్సల్లో బ్లడ్ అవసరమైన వాళ్ల ఎలాంటి మెసేజ్ చూసినా మా ఫౌండేషన్ సభ్యులు వెళ్లి రక్తదానం చేస్తుంటారు. ఇప్పటి వరకూ 5 వేల యూనిట్లు రక్తదానం చేశాం.
– చెన్నంశెట్టి వికాస్, దివ్య ఫౌండేషన్ వ్యవస్థాపకుడు


