న్యూస్‌రీల్
ఒకవైపు రక్షణ.. ఇక్కడ మాత్రం భక్షణ?
నేడు పీజీఆర్‌ఎస్
కొండలమ్మ సేవలో ఎంపీ
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
సోమవారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2026
తీరంలో తమ్ముళ్ల భూదందా
● 100 ఎకరాల మడ భూములపై
కూటమి నేతల కన్ను
● ఇష్టానుసారంగా నరికేస్తున్న వైనం
● ఇప్పటికే సుమారు 20 ఎకరాలు
నరికివేత
● ఇంత జరుగుతున్నా కన్నెత్తి చూడని
అధికారులు
కృత్తివెన్ను: అది ప్రభుత్వ అసైన్డ్ భూమి.. మడ అడవులతో నిండి ఉంది.. తుపానుల సమయంలో సముద్రపు ముంపు నుంచి ప్రజలను రక్షించే రక్షణ కవచం.. కానీ కూటమి నేతల కన్ను ఆ భూములపై పడింది.. ఇంకేముంది అనుకున్నదే తడవుగా వందల మందితో ఇష్టానుసారంగా మడ అడవులను నిర్ధాక్షిణ్యంగా నరికేయడం ప్రారంభించారు. కృత్తివెన్ను మండలం నిడమర్రు పంచాయతీ గోగిలేరు పరీవాహక ప్రాంతంలోని ఆర్‌ఎస్ నంబర్ 105లో సుమారు 120పై చిలుకు ఎకరాల్లో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. ఇప్పుడు వాటిని నరికేసి చెరువులుగా మార్చేందుకుగాను ఇప్పటికే సుమారు 20 ఎకరాల వరకూ చెట్లను నరికేశారు.
నిడమర్రు దళితవాడ, గోగిలేరు పాయకు మధ్యలో దాదాపు 120 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములున్నాయి. ఈ భూముల్లో విస్తారంగా మడ అడవులు వ్యాపించి ఉన్నాయి. సముద్రానికి అత్యంత చేరువుగా ఉన్న ఈ ప్రాంతాన్ని తుపానుల సమయంలో సముద్రపు ముంపు నుంచి రక్షించడంలో మడ అడవులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఇప్పుడు స్థానికంగా ఉన్న కొందరు కూటమి నేతలు ఈ భూములపై కన్నేశారు. మడ చెట్లను నరికేసి మొత్తం ఈ భూములను చేపలు, రొయ్యల చెరువులుగా మార్చేందుకు రంగం సిద్ధం చేశారు. రోజుకు సుమారు 100 మందికి పైగా కూలీలను మడచెట్లు నరికే పనికి పురమాయించారు. ఇప్పటి వరకు సుమారు 20 ఎకరాలకు పైగా భూముల్లో మడ చెట్లను నరికేశారు. దీనిపై స్థానికులు కొందరు తమ ప్రాంతాన్ని రక్షించే మడ అడవులను కూటమి నాయకులు ఈ విధంగా దోచుకునేందుకు పాల్పడుతుండటంపై మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా దీనిపై కనీసం స్పందించని అధికారుల తీరును వారు తప్పు పడుతున్నారు.
మడ అడవుల నరికేతవేతపై రెవెన్యూ అధికారులను ప్రశ్నించగా.. సర్వే నంబర్ 105లో ఉన్నవన్నీ ప్రభుత్వ భూములేనని, వాటిలో మడచెట్లను నరకడం చట్టవిరుద్ధమన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తామని చెప్పారు.
7
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదిక(పీజీఆర్‌ఎస్) ప్రారంభమవుతుందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు.
గుడ్లవల్లేరు:వేమవరం శ్రీ కొండలమ్మ అమ్మవారిని రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ ఆదివారం దర్శించుకున్నారు. అధికారులు అమ్మవారి చిత్రపటం అందించారు.
తీరప్రాంత పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చించి తీరం వెంబడి మడ మొక్కలను నాటి సంరక్షిస్తుంటే.. కృత్తివెన్ను మండలంలో మాత్రం ప్రభుత్వ భూముల్లో సహజ సిద్ధంగా ఏర్పడ్డ అడవులను ధ్వంసం చేసి కబ్జా చేస్తున్న వైనంపై ఉన్నతాధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.


