మంత్రి ఇలాకాలో యథేచ్ఛగా మద్యం దందా | - | Sakshi
Sakshi News home page

మంత్రి ఇలాకాలో యథేచ్ఛగా మద్యం దందా

Mar 16 2026 8:34 AM | Updated on Mar 16 2026 8:34 AM

మంత్రి ఇలాకాలో యథేచ్ఛగా మద్యం దందా సాక్షి నెట్‌వర్క్‌: సాక్షాత్తూ రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సొంత నియోజకవర్గంలోనే మద్యం ఏరులై పారుతోంది. అధికారపార్టీ నాయకులు మంత్రి అండతో ఇష్టానుసారంగా నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి బార్‌లను ఏర్పాటు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన లాటరీ ప్రక్రియతో కలిపి మొత్తం 11 బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, ఆరు వైన్‌షాపులు ఉన్నాయి. వీటిలో దాదాపుగా అధికార పార్టీకి చెందిన నాయకులే నిర్వాహకులుగా మారి మద్యం వ్యాపారాన్ని విచ్చలవిడిగా సాగిస్తున్నారు. ఎకై ్సజ్‌ అధికారుల నిబంధనలను పాటించకుండా ఇష్టానుసారం అమ్మకాలు జరుపుతున్నారని నగర ప్రజలు ఆరోపణలు చేస్తున్నప్పటికీ అధికారులు వీటిని పట్టించుకున్న పాపాన పోలేదు. మచిలీపట్నం నియోజకవర్గంలో గత ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని నియంత్రించాలనే సదుద్దేశంతో పనిచేసింది. నాటి ప్రభుత్వమే వైన్‌షాపులను నిర్వహించింది. ఎకై ్సజ్‌ శాఖ నిబంధనల ప్రకారం సమయపాలన పక్కాగా పాటిస్తూ వ్యాపారం సాగేది. గతంలో నియోజకవర్గంలో ఎనిమిది బార్లు, ఐదు ప్రభుత్వ వైన్‌షాపులు ఉండేవి. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత మద్యం వ్యాపారాన్ని విచ్చలవిడి చేసింది. నియోజకవర్గ పరిధిలో 11, 6 వైన్‌షాపులకు లాటరీ ప్రక్రియ నిర్వహించింది. వీటిని దక్కించుకోవటంలో అధికార పార్టీ నాయకులు ఎక్కువగా ఉండటం నియోజకవర్గ ప్రజలకు శాపంగా మారింది. వైన్‌షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు దక్కించుకున్న నిర్వాహకులు ఎకై ్సజ్‌శాఖ విధించిన నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే నిర్వాహకులు వారి ఇష్టానుసారం షాపులను ఏర్పాటు చేస్తూ ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ● ఇటీవల జిల్లా పరిషత్‌ సెంటరులో బార్‌ అండ్‌ రెస్టారెంట్లు దక్కించుకున్న నిర్వాహకులు ఇళ్ల మధ్యలో బార్‌ పెట్టకూడదని అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని పోరాటం చేశారు. అయినప్పటికీ అధికార పార్టీ నాయకులు ప్రజల మాటను లెక్క చేయకుండా అదే ప్రాంతంలో బార్‌ అండ్‌ రెస్టారెంట్లు ఏర్పాటు చేసి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ● ఇటీవల బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ప్రారంభ సమయంలో ఎమ్మార్పీ ధరలకే విక్రయాలంటూ నగర కూడళ్లలోని మహనీయుల విగ్రహాల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేయటం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై కూడా మునిసిపల్‌ అధికారులు అధికార పార్టీ నాయకులకు తలొగ్గి వ్యవహరించారన్న ఆరోపణలు కూడా వినవచ్చాయి. మరో పక్క నియోజకవర్గ పరిధిలో గ్రామగ్రామాన, అర్బన్‌ ప్రాంతాల్లో వీధివీధికీ పదుల సంఖ్యలో బెల్టుషాపులు ఏర్పాటు చేసి మద్యం విక్రయాలను విచ్చలవిడిగా సాగిస్తున్నారన్న ఆరోపణలు నియోజకవర్గ ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎకై ్సజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎకై ్సజ్‌ అధికారులు ఈ మద్యం దందాను ఏ విధంగా నియంత్రిస్తారో వేచి చూడాల్సి ఉంది.

ప్రొవిజనల్‌ లైసెన్సుతోనే..

ఫిబ్రవరి 5వ తేదీన లాటరీ పద్దతిలో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ దక్కించుకున్న నిర్వాహకులు చిలకలపూడి రైల్వేస్టేషన్‌ సమీపంలో గురువారం కంటైనర్‌లో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ప్రారంభించారు. ఇది నిబంధనలకు విరుద్ధం. దీనిపై ఎకై ్సజ్‌ అధికారులను వివరణ కోరగా, నిర్వాహకుడు షాపు దక్కించుకున్న వెంటనే ప్రొవిజినల్‌ లైసెన్సు అందజేస్తామని, అన్ని సదుపాయాలతో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు చేసిన తరువాత పరిశీలించి పర్మినెంట్‌ లైసెన్సు అందజేస్తామన్నారు. ప్రస్తుతం ఈ కంటైనర్‌ బార్‌ ప్రొవిజినల్‌ లైసెన్సుతో వ్యాపారం ప్రారంభించారని 15 రోజుల తరువాత పరిశీలిస్తామని తెలియజేశారు. అయితే బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని అయితే నిర్వాహకులు ప్రొవిజినల్‌ లైసెన్సు కాలపరిమితి పెంచుకంటూ వస్తున్నారని ఎకై ్సజ్‌ అధికారులు వివరించారు. లాటరీ ద్వారా షాపు కేటాయించి నెలా 10 రోజులు గడిచినా.. ఇంకా ఆ లైసెన్సుతోనే షాపు ఎలా ఏర్పాటు చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నడి రోడ్డుపై కంటైనర్‌, టెంట్లు ఏర్పాటు చేసి బార్‌ను నిర్వహిస్తుంటే ఎకై ్సజ్‌ అధికారులు ఏం చేస్తున్నారని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు.

జనావాసాల్లోనే బార్‌,

వైన్‌షాపులు

ప్రజలు తిరగబడినా

ఫలితం శూన్యం

నెలలు గడుస్తున్నా ప్రొవిజినల్‌

లైసెన్సుతోనే బార్‌ నిర్వహణ

విచ్చలవిడిగా బెల్టుషాపులు

నిబంధనల అమలును

గాలికొదిలేసిన ఎకై ్సజ్‌ అధికారులు

గతంలో ఇలా..

నిబంధనలకు నీళ్లు..

విచ్చలవిడి ‘గొలుసు’..

నిబంధనలంటే అలుసు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement