రెడ్‌ క్రాస్‌ సేవలు భేష్‌ | - | Sakshi
Sakshi News home page

రెడ్‌ క్రాస్‌ సేవలు భేష్‌

Mar 16 2026 8:34 AM | Updated on Mar 16 2026 8:34 AM

రెడ్‌ క్రాస్‌ సేవలు భేష్‌

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): జిల్లాలో పీ4 కార్యక్రమానికి ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ (ఐఆర్‌సీఎస్‌) జిల్లా శాఖ అందిస్తున్న భాగస్వామ్యం గొప్పదని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ అన్నారు. విజయవాడ గాంధీనగర్‌లోని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా శాఖ కార్యాలయంలో ఆదివారం పీ4 లో భాగంగా మార్గదర్శుల సహకారంతో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ చేశారు. అనంతరం భవనంలో కొత్తగా లిఫ్ట్‌ను ప్రారంభించారు. కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో పీ4 కార్యక్రమం బాగా జరుగుతోందన్నారు. పారిశ్రామికవేత్త చల్లా రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఏ కార్యక్రమం చేపట్టినా తన వంతు సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె. మధుమూర్తి తదితరుల పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement