వేడుకగా సంక్రాంతి సంబరాలు
పోలీస్ గ్రౌండ్స్‌లో పాల్గొన్న డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడలోని సిటీ రిజర్వ్ గ్రౌండ్స్‌లో మంగళవారం సంక్రాంతి వేడుకలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దంపతులతో పాటు కమిషనరేట్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రౌండ్స్‌లో భోగిమంటలు, ధాన్యపు రాసులు, హరిదాసులకు ధాన్యపు రాసుల అందజేతతో పాటు గ్రామీణ వాతావరణం ప్రతిబింబించే ఏర్పాట్లు చేశారు. గంగిరెద్దులు, డూడూ బసవన్నలు, ఎడ్లబండ్లు, ముత్యాల గొబ్బెమ్మలు, ముగ్గుల రంగవల్లులతో ఆ ప్రాంగణంలో పండుగ శోభ నెలకొంది. కోలాటం, కర్రసాము, కబడ్డీ, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్ వంటి సంప్రదాయ క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు, డీసీపీలు కృష్ణకాంత్‌పటేల్, షిరీన్‌బేగంలతో పాటు, ఇతర అధికారులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.
గంగిరెద్దు వద్ద డీజీపీ, సీపీ దంపతులు
సాంస్కృతిక కార్యక్రమాల్లో విజేతలతో డీజీపీ, సీపీ
వేడుకగా సంక్రాంతి సంబరాలు


