గణతంత్ర వేడుకలకు సిద్ధార్థ ఎన్‌సీసీ విద్యార్థి
పెనమలూరు: గణతంత్ర వేడుకల్లో పాల్గొనడానికి కానూరు కేసీపీ సిద్ధార్థ ఆదర్శ పాఠశాల విద్యార్థి జె.శ్రీరామ్‌కు అవకాశం దక్కింది. ఏపీ 17వ బెటాలియన్‌కు చెందిన శ్రీరామ్ న్యూఢిల్లీలో జనవరి 26న జరగనున్న గణతంత్ర వేడుకల్లో ఏపీ, తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఈ సందర్భంగా పాఠశాల కన్వీనర్ వీరపనేని శశికళ, ప్రిన్సిపాల్ వి.సాయికృష్ణ, ఎన్‌సీసీ కమాండింగ్ అధికారులు హరిబాబు, పాండే తదితరులు అభినందనలు తెలిపారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): లాకర్‌లో దాచిన సొమ్ము అదృశ్యమైన ఘటన విద్యాధరపురంలోని ఏకలవ్య నగర్‌లో జరిగింది. న్యూఆర్‌ఆర్‌పేటకు చెందిన ముత్యాల విజయ్ ఏకలవ్యనగర్‌లోని ఇన్‌స్టా కార్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆపరేషన్స్ ఆఫీసర్. ఈనెల 9, 10 తేదీల్లో కంపెనీకి చెందిన డెలివరీ షిఫ్టింగ్ నగదు రూ. 4,92,474 వచ్చాయి. 10వ తేదీ రెండో శనివారం బ్యాంక్ సెలవు కావడంతో ఆ సొమ్మును కంపెనీ కార్యాలయంలోని డిజిటల్ లాకర్‌లో భద్రపరిచాడు. ఆదివారం ఉదయం వచ్చిన డబ్బును కూడా లాకర్‌లో పెడతామని ఓపెన్ చేయగా రూ. 4,92,474 కనిపించలేదు. డిజిటల్ లాకర్‌లో దాచిన నగదు అదృశ్యం కావడంపై విజయ్ భవానీపురం పీఎస్‌లో పిర్యాదు చేశాడు. గుర్తు తెలియని వ్యక్తులు తీసి ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్‌జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్‌లో 39 ఫిర్యాదులు స్వీకరించారు. సీపీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ఫిర్యాదులు తీసుకున్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులు, వృద్ధుల వద్దకే వెళ్లి ఫిర్యాదు అందుకున్నారు. ఫిర్యాదులపై సంబంధిత ఎస్‌హెచ్‌ఓలతో మాట్లాడి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్తివివాదాలు, నగదు లావాదేవీలపై 16 ఫిర్యాదులు, కుటుంబ కలహాలపై 3, వివిధ మోసాలపై 3, మహిళా సంబంధిత నేరాలపై 2. దొంగతనాలపై 1, కొట్లాటలపై 1, వివిధ సమస్యలపై 13 ఫిర్యాదులు అందాయి.
లబ్బీపేట(విజయవాడతూర్పు): దూరదృష్టి గల శాస్త్రవేత్త డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు అని పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రపంచ వైద్య విజ్ఞానానికి ఎనలేని సేవలందించిన డాక్టర్ సుబ్బారావు జయంతిని పురస్కరించుకుని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో సోమవారం రీసెర్చ్ డే వేడుకలు నిర్వహించారు. తొలుత యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ సుబ్బారావు విగ్రహాన్ని వైస్ చాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ ఆవిష్కరించారు. అనంతరం వైద్య రంగంలో విశిష్ట పరిశోధనలు చేస్తున్న పలువురు వైద్యులు, వైద్య విద్యార్ధులకు ఉత్తమ పరిశోధకుల అవార్డులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా వీసీ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు ఆధునిక బయోకెమిస్ట్రీ పితామహుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారన్నారు. ఎల్లాప్రగడ సుబ్బారావు అవార్డును సీనియర్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్ ,డైరెక్టర్ – కార్డియోవాస్క్యులర్ సర్జికల్ రీసెర్చ్, స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ లోకేశ్వరరావు సజ్జాకు ప్రదానం చేశారు. అనంతరం ఆయన ‘మెడికల్ రీసెర్చ్ – గతం, వర్తమానం, భవిష్యత్’ అంశంపై ముఖ్య ఉపన్యాసం ఇచ్చారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి, కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్‌బాబు, రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ సూర్యప్రభ, పబ్లికేషన్స్ డైరెక్టర్ డాక్టర్ సుధ తదితరులు పాల్గొన్నారు.
గణతంత్ర వేడుకలకు సిద్ధార్థ ఎన్‌సీసీ విద్యార్థి
గణతంత్ర వేడుకలకు సిద్ధార్థ ఎన్‌సీసీ విద్యార్థి


