దుర్గమ్మ నిత్యాన్నదానానికి రూ. 4 లక్షల విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి అనకాపల్లికి చెందిన భక్తులు సోమవారం రూ. 4 లక్షల విరాళాన్ని అందజేశారు. అనకాపల్లికి చెందిన కొలగంటి అభియాన్ రూ. 2లక్షలు, కొలగంటి రవి రూ. 2లక్షల విరాళాన్ని అమ్మవారి నిత్యాన్నదానం నిమిత్తం ఆలయ అధికారులకు అందించారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలోని దువ్వ గ్రామానికి చెందిన కొప్పిశెట్టి శ్రీవల్లీ కుటుంబం ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం రూ. లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.
వేంకటేశ్వరుని సన్నిధిలో..
తిరుమలగిరి(జగ్గయ్యపేట): తిరుమలగిరి వాల్మీకోద్భవ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అమలవుతున్న నిత్యాన్నదానానికి మండలంలోని తొర్రకుంటపాలెం గ్రామానికి చెందిన తరిగొప్పల వెంకట సతీష్ దంపతులు సోమవారం రూ. లక్ష విరాళంగా అందించినట్లు ఆలయ ఈవో సాంబశివరావు తెలిపారు.


