బాల్‌ బ్యాడ్మింటన్‌ జట్టు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

బాల్‌ బ్యాడ్మింటన్‌ జట్టు ఎంపిక

Jan 13 2026 5:40 AM | Updated on Jan 13 2026 5:40 AM

బాల్‌

బాల్‌ బ్యాడ్మింటన్‌ జట్టు ఎంపిక

బాల్‌ బ్యాడ్మింటన్‌ జట్టు ఎంపిక 16 నుంచి సాఫ్ట్‌ టెన్నిస్‌ లీగ్‌ 19 నుంచి ఉచిత పశువైద్య శిబిరాలు ఎస్‌ఎంసీ వైద్యులకు ఉత్తమ పరిశోధనా అవార్డులు

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆల్‌ ఇండియా ఇంటర్‌ యూనివర్సిటీ బాల్‌ బ్యాడ్మింటన్‌ (మెన్స్‌) టోర్నమెంట్‌లో కోసం జట్టును సోమవారం ఎంపిక చేశామని డాక్టర్‌ ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ స్పోర్ట్స్‌ బోర్డ్‌ సెక్రటరీ డాక్టర్‌ ఈ.త్రిమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. ఎం.ఉదయ్‌భాస్కర్‌, పి.అఖిల్‌, బి.లక్ష్మి వెంకట కుమార్‌, పి.రవికిరణ్‌, బి.రమాకాంతరెడ్డి, పి.వివేక్‌ కమార్‌, ఎస్‌.అనంత సాయి, బి.రాహుల్‌, ఎం.వెంకట సాయి సూర్య, పి.బాలాజీరెడ్డిలను ఎంపిక చేశామని వివరించారు. విశాఖపట్నంలోకి ఎన్‌ఆర్‌ఐ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌కు చెందిన డాక్టర్‌ ఆర్‌.గున్నాజీకి జట్టుకు మేనేజర్‌గా వ్యవహరిస్తారన్నారు. తిరుచ్చిపల్లిలోని భారతీధషన్‌ యూనివర్సిటీలో ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు ఈ టోర్నీ జరుగుతుందని తెలిపారు. ఎంపికైన క్రీడాకారులను వర్సిటీ వీసీ డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌, రిజిస్ట్రార్‌ వి.రాధికారెడ్డి అభినందించారు.

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): అస్మిత ఖేలో ఇండియా సాఫ్ట్‌ టెన్నిస్‌ సౌత్‌ జోన్‌ మహిళల లీగ్‌ ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ సాఫ్ట్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.దిలీప్‌ కుమార్‌ ప్రకటనలో తెలిపారు. ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలోని టెన్నిస్‌ కాంప్లెక్స్‌లో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ మూడు విభాగాల్లో సింగిల్స్‌, డబుల్స్‌ పోటీలు జరుగుతాయన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఖేలో ఇండియా.జీవోవీ.ఇన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. ఈ పోటీలను ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) చైర్మన్‌ రవి నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): జిల్లాలోని అన్ని గ్రామాలలో ఈనెల 19 నుంచి 31వ తేదీ వరకు ‘ఉచిత పశు వైద్య శిబిరాలు‘ నిర్వహించనున్నట్లు జేడీ డాక్టర్‌ మధు హనుమంతరావు తెలిపారు. సోమవారం ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లోని ఉచిత పశు వైద్య శిబిరం పోస్టర్లు, కరపత్రాలను కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల్లో పశువైద్యాధికారుల సారథ్యంలో శిబిరాల నిర్వహణకు రెండు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఉచిత పశువైద్య శిబిరాలలో గొర్రెలు, మేకలకు, పెద్ద పశువులకు, లేగ దూడలకు ఉచితంగా నట్టల నిర్మూలన మందులు అందజేస్తారన్నారు. గొర్రెలకు బొబ్బ వ్యాధి నిరోధక టీకాలు, కోళ్లలో కొక్కెర తెగులు నివారణ టీకాలు వేయనున్నట్లు తెలిపారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): రీసెర్చ్‌ డేను పురస్కరించుకుని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వ విద్యాలయం అందించిన ఉత్తమ పరిశోధనా అవార్డులను ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలకు చెందిన ముగ్గురు వైద్యులు అందుకున్నారు. డాక్టర్‌ యల్లాప్రగడ సుబ్బారావు జయంతిని పురస్కరించుకుని ఈ అవార్డులు అందజేయగా, ఎస్‌ఎంసీకి చెందిన డాక్టర్‌ చిత్ర, డాక్టర్‌ ప్రభాకర్‌, డాక్టర్‌ ప్రసాద్‌ ఉత్తమ పరిశోధనా అవార్డులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారిని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆలపాటి ఏడుకొండలరావు అభినందనలు తెలిపారు. ఇలాంటి ప్రోత్సాహకరమైన ప్రశంసా అవార్డులు అందించడం వల్ల అధ్యాపకులతో పాటు విద్యార్థుల్లో కూడా పరిశోధనలపై ఆసక్తి పెరిగి, భవిష్యత్తులో మరింత నాణ్యమైన పరిశోధనలు చేయడానికి దోహదపడుతుందని తెలిపారు.

బాల్‌ బ్యాడ్మింటన్‌   జట్టు ఎంపిక 
1
1/2

బాల్‌ బ్యాడ్మింటన్‌ జట్టు ఎంపిక

బాల్‌ బ్యాడ్మింటన్‌   జట్టు ఎంపిక 
2
2/2

బాల్‌ బ్యాడ్మింటన్‌ జట్టు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement