
ఎడతెరిపి లేకుండా..
నందిగామ, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాలతో పాటు పేట మున్సిపాల్టీలో మంగళవారం అర్ధరాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పెనుగంచిప్రోలు మునేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. తిరుతపమ్మ ఆలయ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లింగాల బ్రిడ్జి వద్ద పది అడుగుల మేర మునేరు ప్రవహించడంతో వత్సవాయి మండలాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. జగ్గయ్యపేట మున్సిపాల్టీలోని ఎర్రకాలువ ఉప్పొంగడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.