
మంగళరూపిణికి జేజేలు
ఇంద్రకీలాద్రిపై శ్రావణ సందడి
శ్రావణ శుక్రవారం నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అమ్మవారికి లక్ష కుంకుమార్చన, ప్రత్యేక కుంకుమార్చన, శ్రీచక్రనవార్చనలో ఉభయదాతలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ప్రధాన ఆలయంతో పాటు ప్రవేశ మార్గాలను పూలతో విశేషంగా అలంకరించారు. భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. సర్వ దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవలో పాల్గొనే టికెట్ల కోసం భక్తులు బారులు తీరారు. ఈ టికెట్లపై దేవస్థానం పరిమితి విధించడంతో డిమాండ్ మరింత అధికమైందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు.
– ఇంద్రకీలాద్రి
(విజయవాడపశ్చిమ)

మంగళరూపిణికి జేజేలు