విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
సోమవారం శ్రీ 31 శ్రీ మార్చి శ్రీ 2025
7
నేడు పీజీఆర్‌ఎస్ రద్దు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
తుది దశకు ట్రాక్‌ల ఆధునికీకరణ
దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో హైస్పీడ్ రైళ్ల కోసం ప్రధాన మార్గాలలో చేపట్టిన ట్రాక్‌ల ఆధునికీకరణ పనులు తుది దశకు చేరాయి.
ఈద్ ముబారక్
నెల రోజులుగా కఠిన నియమాలతో ఉపవాస దీక్షలను పాటించిన ముస్లింలు సోమవారం పవిత్ర రంజాన్ పండుగను జరుపుకోనున్నారు.
u8లో
●
● ఓవర్‌హెడ్
ట్యాంకుల నిర్వహణను
గాలికొదిలేస్తున్న గ్రామ పంచాయతీలు
● ట్యాంకులు శిథిలావస్థకు చేరి,
రెయిలింగ్‌లు లేక సిబ్బందికి అవస్థలు
● ట్యాంకుల పరిశుభ్రత, క్లోరినేషన్‌పై
అనుమానాలు
● నిర్లక్ష్యం వహిస్తే ప్రజారోగ్యానికే ప్రమాదం
● ఎన్టీఆర్ జిల్లాలో ఆర్‌డబ్ల్యూఎస్ కింద 464వాటర్ ట్యాంకులు
జి.కొండూరు: ప్రజలకు తాగునీటి సరఫరాలో కీలకమైన ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్వహణను గ్రామ పంచాయతీలు గాలికొదిలేస్తున్నాయి. కొన్ని ట్యాంకులు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని మరమ్మతుల కోసం ఎదురు చూస్తున్నాయి. కొన్ని ట్యాంకుల మెట్ల మార్గాలు ధ్వంసమై కొన్ని, రెయిలింగ్‌లు ఊడిపోయి ప్రమాదకరంగా మారాయి. ట్యాంకుల నిర్వహణ కూడా అంతంతమాత్రంగానే ఉండడంతో పరిశుభ్రత, క్లోరినేషన్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాగునీటి పరిశుభ్రతలో ఏమరపాటుగా ఉంటే ప్రజారోగ్యమే ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
నిర్వహణపై అనుమానాలు..
ఎన్టీఆర్ జిల్లాలో సమగ్ర రక్షిత, రక్షిత, మీడియం రక్షిత మంచినీటి పథకాల కింద 464 ఓవర్‌హెడ్ ట్యాంకులతో పాటు కృష్ణావాటర్‌ను సరఫరా చేసే ట్యాంకులు, సంపులు అదనంగా ఉన్నాయి. కాగా వీటిలో కొన్ని ఇప్పటికే శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు ట్యాంకులలో క్లీనింగ్, క్లోరినేషన్ చేసేందుకు సిబ్బంది ఎక్కి, దిగడానికి వీలుగా నిర్మించిన మెట్లమార్గాలు, రైలింగ్‌లు ఊడిపోయిన ట్యాంకులు కొన్ని ఉన్నాయి. మెట్ల మార్గాలు, రైలింగ్‌లు సక్రమంగా లేకపోవడం వల్ల ప్రతి పదిహేను రోజులకు ట్యాంకులను క్లీన్ చేయాల్సిన సిబ్బంది ట్యాంకులపైకి ఎక్కేందుకు భయపడి క్లీనింగ్ చేయడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. అంతే కాకుండా బోరువాటర్‌ను ట్యాంకులకు ఎక్కించి సరఫరా చేసే గ్రామా ల్లో సిబ్బంది క్లోరినేషన్‌కు వాడే పదార్థాలను బకెట్‌లో తీసుకెళ్లి ప్రతిరోజూ ట్యాంకులో కలపాల్సి ఉంటుంది. ఈ క్రమంలో క్లీనింగ్, క్లోరినేషన్ సక్రమంగా చేయడంలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చేతిపంపుల తీరు అంతే..
ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం అనంతరం నిర్వహణ బాధ్యతలు గ్రామ పంచాయతీలు చేపడతాయి. అదేవిధంగా పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు ఇస్తున్న క్రమంలో చేతి పంపుల నిర్వహణకు కూడా గ్రామ పంచాయతీల నుంచి ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గ్రామ పంచాయతీల అధికారులు ట్యాంకులు, చేతి పంపుల నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. విద్యుత్ సరఫరా నిలిచినప్పుడు, మంచినీటి పథకాలలో నీటి సరఫరా నిలిచినప్పుడు గ్రామీణ ప్రాంత ప్రజలను ఈ చేతి పంపులే ఆదుకుంటాయి. కనుక సమస్యలు ఉన్న చేతి పంపులను వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
మైలవరం మండల పరిధి గణపవరంలో శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంకు
జి.కొండూరు మండల పరిధి సున్నంపాడులో మెట్లమార్గం, రైలింగ్ ధ్వంసమైన వాటర్ ట్యాంకు
న్యూస్‌రీల్
ఎన్టీఆర్ జిల్లాలో ఆర్‌డబ్ల్యూఎస్ కింద తాగునీటి సరఫరా వివరాలు
తాగునీరు సరఫరా గ్రామాలు: 794
జనాభా: 9,87,854
కుటుంబాలు: 2,67,574
ఇంటింటి కుళాయి కనెక్షన్‌లు: 1,10,727
సమగ్ర రక్షిత మంచినీటి
పథకాలు: 20 ట్యాంకులు
రక్షిత మంచినీటి పథకాలు:
380 ట్యాంకులు
మీడియం రక్షిత పథకాలు: 64 ట్యాంకులు
డైరెక్ట్ పంపింగ్ స్కీములు: 510
చేతి పంపులు: 8,444
మరమ్మతులు చేయకపోతే ప్రమాదమే..
ప్రజలకు సరఫరా చేసే తాగునీటి విషయంలో నిర్లక్ష్యం తగదు. గ్రామాలలో ఓవర్‌హెడ్ ట్యాంకులు ఎక్కువ శాతం శిథిలావస్థకు చేరి ఉన్నాయి. కాలం చెల్లిన వాటిని కూల్చి కొత్తవి నిర్మించాలి. మెట్ల మార్గాలు, రైలింగ్‌లు ధ్వంసమైన చోట పునఃరుద్ధరించాలి. లేదంటే సిబ్బంది ట్యాంకులను క్లీన్ చేయడం, క్లోరినేషన్ చేయడం కష్టమవుతుంది.
– ఎం. మహేష్, సీఐటీయూ
జిల్లా కార్యదర్శి, ఇబ్రహీంపట్నం
శిథిలావస్థకు చేరిన ఓవర్‌హెడ్ ట్యాంకులను సౌండ్‌నెస్ టెస్టులు చేయించి కాలం చెల్లినట్లు నిర్ధారణ అయితే ట్యాంకులను కూల్చి.. కొత్త ట్యాంకులను నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ట్యాంకులు ఎక్కువ శాతం గ్రామాలలో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఇళ్ల మధ్యన ఉండడం వల్ల శిథిలావస్థకు చేరిన ట్యాంకులు అకస్మాత్తుగా కూలితే ప్రాణ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ట్యాంకుల మరమ్మతులు, మెట్లమార్గాల పునఃరుద్ధరణ వంటి పనులను వెంటనే చేపట్టకపోతే నీటి పరిశుభ్రత లేక ప్రజారోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ


