కలియుగ దైవం శ్రీనివాసుడు పద్మావతి సమేతుడై భూలోకానికి వస్తే భక్తులుపరవశులైపోరూ! అటువంటి భక్తిరసమైన సన్నివేశం విజయవాడ లబ్బీపేట శారదా చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం సాక్షాత్కరించింది. శ్రీ వారి జన్మతిథి శ్రవణా నక్షత్రం సందర్భంగా శ్రీవేంకటేశ్వరా కల్యాణ ట్రస్ట్ ఆధ్వర్యంలో పద్మావతి శ్రీనివాసుల కల్యాణ కార్యక్రమాన్ని
శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానం అర్చక స్వాములు అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఉత్సవ మూర్తులకు లబ్బీపేట ప్రధాన వీధులగుండా పంచవాయిద్యాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. దేవాలయ ప్రాంగణానికి చేరుకున్న ఉత్సవ విగ్రహాలకు పుణ్యాహవచనం నిర్వహించారు. 50 రకాలైన పూలతోనూ తులసి మాలలతో 100 మంది దంపతులతో పుష్పాభిషేకం చేశారు. కార్యక్రమంలో సేవా ట్రస్ట్ అధ్యక్షుడు పోలిశెట్టి పిచ్చయ్య, ప్రధాన కార్యదర్శి ముచ్చర్ల శ్రీనివాసరావు, కోశాధికారి గోంట్లా రామ్మోహనరావు పాల్గొన్నారు.
– విజయవాడ కల్చరల్