ప్రాణ ప్రదాతలకు 'ప్రెసిడెంట్ సర్వీస్ అవార్డ్‌'ల ప్రదానం

Weta Announce Women Service Award In America - Sakshi

గుంటూరు జిల్లా వినుకొండ మండలానికి చెందిన దేవకి శంకర్ రావు  కుమార్తె ఆశాజ్యోతి దేవకి కరోనా ఆపత్కాలంలో తాను చేసిన సేవకు గాను  'ప్రెసిడెంట్ సర్వీస్ అవార్డు' దక్కింది. ఈ అవార్డ్‌ ను అమెరికాలోని 'విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్' ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమండ్ల, ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ శైలజ కల్లూరిలు పురస్కారంతో పాటు నగదు బహుమతిని అందించారు. కోరోనా సమయంలో ఎంతో మందికి ప్రాణదాతగా నిలిచారని కొనియాడారు.ఇలా ఎన్నో రకాలుగా అందరికి సహాయం చేస్తూ, సేవలు అందిస్తూ అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని ప్రశంసించారు. 

చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన పోతిరెడ్డి వాసుదేవ రెడ్డి కుమార్తె  యామిని పోతిరెడ్డి అమెరికాలో మేరీలాండ్  రాష్ట్రంలో నివసిస్తున్నారు. కోవిడ్‌ క్రైసిస్‌ లో వివిధ సేవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని తెలుగు రాష్ట్రల ప్రజల కోసం చేసిన సేవని గుర్తించి విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమండ్ల, ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ శైలజ కల్లూరి గారి అద్వర్యంలో  "సూపర్ వుమన్ ఇన్ సర్వీస్ అవార్డు" పురస్కారాన్ని అందించారు.

కరోనా సమయంలో మెడికల్ కిట్ డ్రైవ్ స్టార్ట్ చేసి వివిధ మండలంలో ఆక్సిమేటర్స్, కాంటాక్ట్ లెస్ థెర్మోమేటర్స్ అందించారు. అంతే కాకుండా రేణిగుంట కి చెందిన 'అభయ క్షేత్రం' సంస్థకు ఒక నెలకు సరిపడా సరుకుల్ని అందించారు. ఈ అవకాశం అందించి సేవల్ని గుర్తించిన 'వెట' కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. సంస్థలో పని చేస్తున్నందుకు చాల ఆనందంగా ఉందని యామిని రెడ్డి అన్నారు.  

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top