టీపాడ్‌ ఆధ్వర్యంలో ఫుడ్‌ డ్రైవ్‌ కార్యక్రమం

TPAD Conducts Food Drive In Dallas - Sakshi

డల్లస్‌: తెలంగాణ పీపుల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డల్లాస్‌(టీపాడ్‌) ఒక మహత్తర కార్యక్రమానికి పూనుకుంది. బ్లడ్ డ్రైవ్, వ్యాక్సిన్ డ్రైవ్ , ఫుడ్ డ్రైవ్ రూపంలో మూడు సమాజ సేవా కార్యక్రమాలను మూడు నెలల్లోపు నిర్వహించేలా తన సమాజ సేవా కార్యకలాపాలను నిర్వహించింది. డల్లాస్ ప్రాంతంలో ఆశ్రయం ,ఆహారం లేకుండా ఉన్న పేదలను ఏంచుకొని ఆస్టిన్ స్ట్రీట్ ఆశ్రమం సాయంతో ఈ వలంటీర్‌ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫుడ్ డ్రైవ్‌ కార్యక్రమం అధ్యక్షుడు రవికాంత్ మామిడి ఆధ్వర్యంలో జరిగింది. బాధ్యతాయుతమైన సమాజ సంస్థగా, పేదలకు సహాయం చేయడంమా సామాజిక బాధ్యత అని.. రాబోయే నెలల్లో మరిన్ని ఫుడ్ డ్రైవ్‌లు చేస్తామని రవికాంత్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో రావు కల్వాలా, రఘువీర్ బండారు, మాధవి సుంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top