ఎవరీ రాధా అయ్యంగార్‌? ఎందుకు వార్తల్లో వ్యక్తి అయ్యారు?? | Radha Iyengar Plumb Biden administration Department of Defense | Sakshi
Sakshi News home page

ఎవరీ రాధా అయ్యంగార్‌? ఎందుకు వార్తల్లో వ్యక్తి అయ్యారు??

Jun 16 2022 11:28 AM | Updated on Jun 16 2022 11:52 AM

Radha Iyengar Plumb Biden administration Department of Defense - Sakshi

అమెరికాలో ఒక్కసారిగా వార్తల్లో నానుతున్న వక్తిగా రాధా అయ్యంగార్‌ నిలిచారు. ఈ ఇండో అమెరికన్‌ మహిళను కీలక పదవిలోకి తీసుకోవాలనే భావనలో వైట్‌హౌజ్‌ ఉండటంతో ఒక్కసారిగా ఈమె పేరు తెరమీదకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక పదవికి ఆమె పేరును జూన్‌ 15న నామినేట్‌ చేశారు.

అమెరికా రక్షణ వ్యవహరాలను పర్యవేక్షించే పెంటగాన్‌లో కీలక స్థానాల​కు ఐదుగురి పేర్లను అమెరికన్‌ ప్రెసిడెంట్‌ జోబైడెన్‌ ప్రతిపాదించారు. దానిలో సెక్యూరిటీ విభాగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న రాధ అయ్యంగార్‌ ప్లంబ్‌ కూడా ఉన్నారు. ఆమెను డిప్యూటీ అండర్‌ సెక్రటరీ ఫర్‌ డిఫెన్స్‌ పోస్టుకు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం రాధా అయ్యంగార్‌ డెప్యూటీ సెక్రటరీ ఆఫ్‌ డిఫెన్స్‌లో చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ హోదాలో పని చేస్తున్నారు.

ప్రభుత్వ సర్వీసుల్లోకి వెళ్లక ముందు గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి టెక్‌ దిగ్గజ కంపెనీలో రాధ పని చేశారు. గూగుల్‌లో రీసెర్చ్‌ విభాగంలో ఆమె పని చేశారు. ఆ తర్వాత సోషల్‌ మీడియాకు కొత్త అర్థం చెప్పిన ఫేస్‌బుక్‌లో పాలసీ అనాలిసిస్‌ గ్లోబల్‌ హెడ్‌ కొనసాగారు. అంతకు ముందు ఆమె ఎకనామిస్ట్‌గా కూడా అనుభవం గడించారు. హర్వార్డ్‌, ప్రిన్స్‌టన్‌ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఆమె చదువుకున్నారు.

చదవండి: Sopen Shah: అటార్నీగా భారత సంతతి మహిళ.. నామినేట్‌ చేసిన బైడెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement