
ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త తమకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలిపింది. మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రజల గుండెల్లో కృష్ణ సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారని నాట్క్ పేర్కొంది. నటుడిగానే కాకుండా అందరికి ఆత్మీయుడిగా, నిర్మాతల నటుడిగా ఉన్నతమైన వ్యక్తిత్వంతో జీవించిన కృష్ణ ఇక లేరనే విషయం జీర్ణించుకోలేనిదని నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి ఓ ప్రకటనలో తెలిపారు.
కృష్ట మరణ వార్త అమెరికాలో తెలుగువారందరిని కలవరపరిచిందని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు) నూతి పేర్కొన్నారు. కృష్ణ ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఇటీవల వరుసగా కృష్ణ కుటుంబంలో నలుగురు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం దురదృష్ణకరమన్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment