అమెరికాలో తెలుగు ఆచార్యుడు త్రివిక్రమ్ రెడ్డికి అరుదైన అవార్డు

New Jersey Institute awarded Excellence Award To Trivikram Reddy - Sakshi

నెవార్క్ (న్యూ జెర్సీ):  అమెరికాలో తెలుగు ఆచార్యుడికి అరుదైన అవార్డు లభించింది. న్యూజెర్సీలో ఉంటున్న త్రివిక్రమ్ రెడ్డి భానోజీ పాలకి న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌జేఐటీ) ఎక్సలెన్స్‌ ఆఫ్ టీచింగ్ పురస్కారం ప్రకటించింది. మెకానికల్ విద్య బోధనలో అత్యుత్తమ ఆధ్యాపకుడంటూ ఆయన సేవలను ప్రశంసించింది. మెషిన్ డిజైన్, మెకానికల్ సిస్టమ్ డిజైన్ తో పాటు స్ట్రైస్ ఎనాలిసిస్‌లను బోధించడంలో త్రివిక్రమ్‌రెడ్డి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రేట్ మై ప్రొఫెసర్ అని ఇచ్చే ర్యాంకింగ్‌లలో ఆయన టాప్ రేటింగ్ సాధించారు. 

టీచింగ్‌ ఫీల్డ్‌లో కొనసాగుతూనే బెక్టన్ డికిన్సన్ కంపెనీలో రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ స్టాప్ ఇంజనీరుగా కూడా త్రివిక్రమ్‌రెడ్డి సేవలందిస్తున్నారు. రోగులకు మందులను సరఫరా చేసేందుకు సరికొత్త పరికరాలను ఆయన రూపొందించారు. ఇలా తాను రూపొందించిన ఏడు పరికరాలపై ఆయనకు పేటెంట్ల ఉన్నాయి.  
 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top