విదేశాల నుంచి ఇండియా వచ్చే వారికి అలెర్ట్‌! డిసెంబర్‌ 1 నుంచి కొత్త రూల్స్‌

Amid Omicron India Revises Covid 19 Guidelines For International Travellers  - Sakshi

India Issues Revised Covid Guidelines for International Travellers Over Omicron Variant: విదేశాల నుంచి ఇండియాకి వచ్చే ఎన్నారైలు, వివిధ దేశాలకు చెందిన పౌరులకు కేంద్ర ఆరోగ్య శాఖ నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. డిసెంబరు 1 నుంచి ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఓమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి అరికట్టే లక్ష్యంతో ఈ కొత్త రూల్స్‌ తెరపైకి వచ్చాయి.

ఎయిర్‌ సువిధా
విదేశాల నుంచి ఇండియాకి వచ్చే వారు తమ ప్రయాణ తేదికి కంటే ముందు 14 రోజుల ట్రావెల్‌ హిస్టరీని ఎయిర్‌ సువిధా పోర్టల్‌లో ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ప్రయాణ తేదికి 72 గంటల ముందు చేయించిన ఆర్టీ పీసీఆర్‌ నెగటివ్‌ రిపోర్టును స్వచ్చంధంగా సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాదు అవసరమైతే ప్రభుత్వం నిర్ధేశించినట్టుగా క్వారంటైన్‌లో ఉంటామని సెల్ఫ్‌ డిక్లరేషన్‌ సమర్పించాలి.
క్వారంటైన్‌ తప్పని సరి
ఇక భారత ప్రభుత్వం ‘అట్‌ రిస్క్‌’గా ప్రకటించిన జాబితాలోని దేశాలకు చెందిన ప్రజలు ఇండియాలోకి ఎంటరైన తర్వాత తప్పనిసరిగా ఆర్టీ పీసీఆర్‌ టెస్ట్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. టెస్టులో నెగటివ్‌ రిపోర్టు వచ్చినా... ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఎనిమిదవ రోజు టెస్ట్‌ చేసి అప్పుడు కూడా నెగటీవ్‌గా వస్తే.. మరో ఏడు రోజుల పాటు సెల్ఫ్‌ మానిటరింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత సాధారణంగా అందరితో కలిసిపోవచ్చు. 
@రిస్క్‌ జాబితా
ఒమేక్రాన్‌ వేరియంట్‌ ప్రభావం ఎక్కువగా ఉందని భావిస్తున్న యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, బంగ్లాదేశ్‌, బోత్స్వానా, చైనా, మారిషస్‌, న్యూజీల్యాండ్‌, సింగపూర్‌, జింబాబ్వే, హాంగ్‌కాంగ్‌, ఇజ్రాయిల్‌ దేశాలు కేంద్రం ప్రకటించిన అట్‌ రిస్క్‌ జాబితాలో ఉన్నాయి. ఈ దేశాల నుంచి వచ్చే వారు ఎయిర్‌పోర్టులు కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకోవడంతో పాటు 14 రోజుల క్వారెంటైన్‌ తప్పనిసరి.
పాజిటివ్‌ వస్తే
ఎయిర్‌పోర్టులో జరిపే సెల్ఫ్‌ పెయిడ్‌ టెస్టులో పాజిటివ్‌గా తేలిన వ్యక్తులను ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారెంటైన్‌ సెంటర్‌కి తరలించి వైద్య సాయం అందిస్తారు. పాజిటివ్‌గా తేలిన వ్యక్తులతో పాటు వాటి కాంటాక్టులుగా తేలిన అందిరినీ హోం క్వారెంటైన్‌ చేస్తారు. ఇంటర్నేషనల్‌ ప్రయాణికులు ఇండియాకి వచ్చిన తర్వాత ఆరోగ్య సేపు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం మంచిదని కేంద్రం సూచిస్తోంది. 

చదవండి:విమానయానంపై ఒమిక్రాన్‌  ప్రభావం.. జాగ్రత్తగా జర్నీ 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top