నూతనంగా ఎర్పాటైన ఆటా బోర్డు, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు

American Telugu Association New Board And Executive Members For 2023 To 24 - Sakshi

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) నూతన అధ్యక్షురాలిగా మధు బొమ్మినేని బాధ్యతలు స్వీకరించారు. లాస్ వేగాస్లోని ది మిరాగ్ లో శనివారిం జరిగిన ఆటా బోర్డు మీటింగ్ లో ప్రస్తుత అధ్యక్షులు భువనేశ్ భూజల చేతుల మీదుగా మధు బొమ్మినేని నూతన అధ్య క్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సమావేశానికి యూఎస్ లోని అన్ని ప్రాంతాల నిండి ఆటా డైరెక్టర్లు, సలహాదారులు, మాజీ అధ్యక్షులు, స్టాండింగ్‌ కమిటీ సభ్యులు, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు.

నార్తు కరోలినా ప్రాంతానికి చెందిన మధు బొమ్మినేని 2004 నిండి ’ఆటా’ లో చురుగ్గా ఉిండడంతో పాటు, ఆటా సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ వంటి అనేక పదవుల్లో సేవలందించారు. 2023 జనవరిలో ఆటాలోని 16 బోర్తుఆఫ్ ట్రస్టీ స్థానాలకు ఎన్నికలు జరిగాయ. ఎన్నికైన సభ్యులు నాలుగేండ్లు పాటు పదవిలో కొనసాగుతున్నారు. అనిల్ బొదిరెడ్డి, సన్నిరెడ్డి, కిరణ్ పాశం, కిషోర్‌ గూడూరు, మహీదర్‌ ముస్కుల, నర్సిరెడ్డి గడి కొప్పుల, రామకృష్ణారెడ్డి అల, రాజు కక్కెర్ల, సాయి సుధిని, శ్రీకాంత్‌ గుడిపాటి, నర్సింహారెడ్డి ధ్యాసాని, రఘవీర్‌ మరిపెద్ది, సాయినాథ్‌ బోయపల్లి, సతీష్‌రెడ్డి, శ్రీనివాస్‌ దర్గుల, వినోద్‌ కోడూరు బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆటా బోర్డు ఏకగ్రీవంగా జయింత్‌ చల్లాను కాబోయే ప్రెసిడెంట్‌గా ఎన్నుకుంది. ఆటా బోర్డు 2023, 2024 టర్మ్‌కి ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు రామకృష్ణారెడ్డి అల (కార్యదర్శి), సతీష్ రెడ్డి (కోశాధికారి), తిరుపతి రెడ్డి యర్రంరెడ్డి ( జాయింట్‌ సెక్రటరీ), రవీందర్‌ గూడూరు (జాయింట్‌ ట్రెజరర్‌), హరి ప్రసాద్‌ రెడ్డి లింగాల (ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌)గా ఎన్నికయ్యారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top