
అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి సంవత్సర వేడుకలు నిరాటకంగా సాగుతున్నాయి. ఘంటసాల శతజయంతి సందర్భంగా 'ఘంటసాల స్వర రాగ మహాయాగం' పేరుతో 366 రోజులపాటు స్వర రాగ మహాయాగం కొనసాగుతోంది. 'ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, 'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సింగపూర్, 'వంశీ ఇంటర్నేషనల్' 'శుభోదయం గ్రూప్స్' సంయుక్త ఆధ్వర్యంలో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
366 రోజులపాటు నిర్వహింపబడే 'ఘంటసాల స్వర రాగ మహాయాగం' లో భాగంగా సింగపూర్ గాయకులచే 58 వ రోజు కార్యక్రమం జనవరి 30, 2022 సమయం: 12:30 గంటలకు (సింగపూర్ కాలమానం ప్రకారం) నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యక్ష ప్రసారం కోసం ఈ కింది లింక్స్ లో చూడొచ్చని నిర్వాహకులు తెలిపారు.
https://www.facebook.com/events/2799312443705780/
https://www.youtube.com/watch?v=xJDLIPIYMvY
చదవండి: నిరాటంకంగా ఘంటసాల స్వర రాగ మహాయాగం