నిజామాబాద్ రూరల్: ప్రజలకు రైల్వే సేవలు మరింత చేరువయ్యాయని, ప్రధాని మోదీ నా యకత్వంలో రైల్వే మౌలిక సదుపాయాలు, సా మర్థ్యం పెంపునకు తెలంగాణ సా క్ష్యంగా నిలిచిందని ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. జానకంపేటలోని గూడ్స్ షెడ్‌ను గురువారం ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.8.80 కోట్ల అంచనా వ్యయంతో నిజామాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణ పునరుద్ధరణ పనులు, అలాగే నిజామాబాద్‌కు రూ.124 కోట్ల వ్యయంతో 2 కి లోమీటర్ల పొడవున బైపాస్ లైన్ మంజూరు కాగా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో డబ్లింగ్ పను లు కొనసాగుతున్నాయని, బాసర–నవీపేట మధ్య 15కిలోమీటర్ల మేర పనులు పూర్తయి ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులచారి దినేశ్, రైల్వే అధికారులు పాల్గొన్నారు.


