న్యూస్‌రీల్
నిజామాబాద్
సాగు సరే..
● రోజుకో ప్రకటనతో వరిసాగుచేస్తున్న రైతుల్లో అయోమయం
● ఆన్‌లైన్‌లో విత్తన వివరాల నమోదు తప్పనిసరి అంటున్న ప్రభుత్వం
● పోర్టల్‌లో నమోదైతేనే ‘బోనస్’
అందే అవకాశం
● అనుమతించిన ఏడు రకాల
విత్తనాల్లో ఇంకా విడుదల కాని
‘కేఎన్‌ఎం–7715’
అంగన్‌వాడీ కేంద్రాల్లో..
అంగన్‌వాడీ కేంద్రాలలో సేంద్రియ విధానంలో సాగు చేసిన ఆకుకూరలను అందించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
శుక్రవారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2026
– 8లో u
సన్నాల సాగు రైతులను సంకట స్థితిలోకి నెట్టింది. ముందు ఏ సన్నాలు సాగు చేసినా బోనస్ ఇస్తామన్న ప్రభుత్వం.. ఆ తరువాత ఏడు రకాలకే ఇస్తామని ప్రకటించింది. ప్రభుత్వం సూచించిన ఏడు రకాల్లోనే తమకు అనువైనవాటిని ఎంచుకుని రైతులు సాగు చేస్తుండగా.. విత్తన కొనుగోలు సమయంలో వివరాలు ఆన్‌లైన్‌లో నమోదైతేనే బోనస్ వస్తుందని పేర్కొంటుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
డొంకేశ్వర్(ఆర్మూర్) : సన్న రకాల వరి సాగు, ప్రభుత్వం ప్రకటించిన బోనస్‌కు సంబంధించి రోజుకో కొ త్త నిబంధన వస్తుండడంతో అన్నదాతల్లో తీవ్ర గందరగోళం నెల కొంది. తొలుత సన్న రకాలను సాగు చేస్తేనే కొనుగోలు చేస్తా మని ప్రభుత్వం చెప్పింది. ఆ తరువాత ఎంపిక చేసిన ఏడు ర కాలను మాత్రమే సాగు చేయాలని, వాటికే బోనస్ ఇస్తామని ప్రకటించింది. రైతులు అవే నిబంధనలను అనుసరించి విత్తనాలు కొనుగోలు చేసి ఖరీఫ్ వరి సాగు చేస్తున్నారు. ఇప్పుడు రైతులకు విక్రయించిన విత్తన వివరాలను డీలర్లు ‘సీడ్స్ సేల్స్ పోర్టల్’లో నమోదు చేయాలని మరో నిబంధన తెచ్చి రైతులను అయోమయానికి గురి చేస్తోంది. ఆన్‌లైన్‌లో నమోదై ఉంటేనే క్వింటాల్‌కు రూ.500 చొప్పు న రైతులకు బోనస్ ఇస్తాం అన్నట్లుగా ప్రకటనలు వస్తున్నాయి. పంట వేసిన తర్వాత నిబంధనలు మార్చడంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే రైతులంతా వరి విత్తనాలు కొ నుగోలు చేసి నారు పోసి నాట్లు కూడా వేసేస్తున్నా రు. జిల్లా వ్యాప్తంగా 4.38 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశం ఉండగా, ఇప్పటి వరకు 2.10 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. దీంతో రైతులకు విక్రయించిన విత్తన వివరాలు, రైతు పేరు, ఆధార్, మొబైల్ నంబర్ తదితర వివరాలను డీలర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి ఆస్కారం లేకుండా పో యింది. మరో పక్క ఎంట్రీ చేయాలని వ్యవసాయాధికారులు డీలర్లపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయం ముందే చెప్పి ఉంటే నమోదు చేసే వాళ్లమని డీలర్లు అంటున్నారు. అదే విధంగా రైతులు డీలర్ల నుంచే కాకుండా సొంతగా విత్తనాలు తయారు చేసే ఇతర రైతుల నుంచి విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేశారు. విత్తన వివరాలను పోర్టల్‌లో ఎవరు నమోదు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంలో వ్యవసాయాధికారులు కూడా ఏదీ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. మారుతున్న నిర్ణయాలపై తాము సైతం గందరగోళానికి గురవుతున్నామని అంటున్నారు. అయితే, పంట కొనుగోలు చేసే సమయంలో ప్రభుత్వం నిబంధనలు అమలు చేస్తుందా? లేక ఆంక్షలు లేకుండా కొనుగోలు చేస్తుందా? అనేది వేచి చూడాలి. అప్పటి వరకు రైతులకు ఈ గందరగోళం తప్పదనే చెప్పొచ్చు.
లేని విత్తనాన్ని ప్రకటించిన ప్రభుత్వం
ఖరీఫ్ సీజన్‌లో ఏడు రకాల సన్నాలను ప్రకటించిన విష యం తెలిసిందే. ఇందులో బీపీటీ– 5204, ఆర్‌ఎన్‌ఆర్– 15048, హెచ్‌ఎంటీ సో నా, జైశ్రీరామ్, కేఎన్‌ఎం– 1638, డబ్ల్యూజీఎల్–44, కేఎన్‌ఎం–7715 ఉ న్నాయి. అయితే, ఏడు రకాల్లో కేఎన్‌ఎం–7715 రకం విత్తనం ఇంకా విడుదల కూడా కాలేదు. విడుదల కాని విత్తనాన్ని ఏడు రకాల్లో ప్రకటించడంతో రైతులు వాటి కోసం డీలర్ల చుట్టూ తిరిగారు. ఆ విత్తనం రాలేదని చెప్పడంతో మిగతా రకాలకు వెళ్లారు.


