గడువులోగా సర్‌ను పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

గడువులోగా సర్‌ను పూర్తి చేయాలి

Jul 10 2026 9:51 AM | Updated on Jul 10 2026 9:51 AM

నిజామాబాద్‌ రూరల్‌: సర్‌ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని, పారదర్శక ఓటరు జాబితా రూపకల్పన కోసం భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అన్నారు. మండలంలోని గాంధీనగర్‌ తండా, గూపన్‌పల్లి గ్రామాలతోపాటు నిజామాబాద్‌ నగరంలోని శంకర్‌భవన్‌ పాఠశాలలో ఎన్యుమరేషన్‌ ఫామ్‌ల స్వీకరణ, వివరాల నమోదు తీరును ఆమె గురువారం నిశితంగా పరిశీలించారు. ఇప్పటివరకు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ఎంత శాతం పూర్తయ్యింది, ఓటర్లందరికీ ఎన్యుమరేషన్‌ ఫామ్‌ల పంపిణీ పూర్తయిందా అనే వివరాలు తెలుసుకున్నారు. అందుబాటులో లేని ఓటర్లకు కూడా సమాచారం అందించాలని, గడువు లోగా వారు తమ ఎన్యుమరేషన్‌ ఫామ్‌లు తిరిగి అందించేలా చూడాలన్నారు. జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లిన వారి ఎన్యుమరేషన్‌ ఫారాలను జాగ్రత్తగా పరిశీలించాలని, వివరాలు సరి చూసుకున్న తరువాత వారి కుటుంబ సభ్యుడి సంతకంతో తీసుకోవచ్చని బీఎల్‌వోలకు సూచించారు. ఎన్యుమరేషన్‌ ఫారా స్వీకరణ, వివరాల డిజిటలైజేషన్‌ను ఏకకాలంలో సమాంతరంగా చేపట్టాలన్నారు. ఎస్‌ఐఆర్‌ను పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీలకు చెందిన బూత్‌ లెవెల్‌ ఏజెంట్లు బీఎల్‌వోలకు సహకారం అందించాలన్నారు. కలెక్టర్‌ వెంట నగర పాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌, ఆర్డీవో రాజేంద్రకుమార్‌, కలెక్టరేట్‌ ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్‌, తహసీల్దార్‌ వినయ్‌సాగర్‌ తదితరులు ఉన్నారు.

విదేశాల్లో ఉన్నవారి ఎన్యుమరేషన్‌ ఫామ్‌లను జాగ్రత్తగా పరిశీలించండి

బీఎల్‌వోలకు కలెక్టర్‌

ఇలా త్రిపాఠి సూచన

రూరల్‌మండలంలోని

పలు గ్రామాల్లో సర్‌ పర్యవేక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement