● పోలీసుల ప్రతిభను వెలికితీసేందుకే ‘డ్యూటీ మీట్’
● నిజామాబాద్ సీపీ సాయిచైతన్య
● పాల్గొన్న బాసర జోన్ పోలీసు అధికారులు
నిజామాబాద్ అర్బన్: విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం ఎంతో అవసరమని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో బాసర జోన్ లెవెల్ పోలీస్ డ్యూటీమీట్–2026ను గురువారం ఆయన ప్రారంభించా రు. మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలను సైన్స్ ఇన్వెస్టిగేషన్ టూల్ గా మార్చుకోవడానికి తమను తాము మెరుగుపర్చుకుని ఉత్తమ ప్రతిభ కనబర్చాలన్నారు. డ్యూటీ మీట్ పోటీలు అందుకు దోహదం చేస్తాయన్నారు. నిజామాబాద్, జగిత్యా ల్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన సీఐలు, ఎస్సైలు హాజరుకాగా, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్, ఫింగర్‌ప్రింట్ ఇన్వెస్టిగేషన్, నేరస్థలాల్లో సేకరించాల్సిన క్లూస్ కోసం ఎంపికలు నిర్వహించారు. నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్ శుభంప్రకాశ్, ఏసీపీలు ప్రకాశ్‌యాదవ్, రాజశేఖర్, శ్రీశైలం, గురునాయుడు, నరేందర్, డాక్టర్ నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.


