● జిల్లాలో 5,874మంది ఉంటారని అంచనా
● 5,451 మందికి వ్యాధి నిర్ధారణ
● వెల్లడించిన డీఎంహెచ్‌వో బి రాజశ్రీ
సుభాష్‌నగర్: జిల్లాలో కొత్తగా హెచ్‌ఐవీ కేసులను గుర్తించాలని డీఎంహెచ్‌వో బి రాజశ్రీ అన్నారు. జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో గురువారం ఎయిడ్స్ కంట్రోల్ విభాగం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ లెక్కల ప్రకారం జిల్లాలో 5874 మంది హెచ్‌ఐవీ సోకిన వారు ఉంటారని అంచనా వేస్తున్నామన్నారు. ఇందులో 5580 మంది బాధితులకు డిసెంబర్ 1, 2026 వరకు తెలిసి ఉండేలా లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు. ఇప్పటివర కు 5451 మందికి హెచ్‌ఐవీ ఉన్నట్లు తెలిసిందని, ఇంకా 136 హెచ్‌ఐవీ కేసులను త్వరగా గుర్తించి చికి త్స అందించేలా దృష్టి సారించాలని ఆదేశించారు. టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ దేవీనాగేశ్వరి, మె డికల్ ఆఫీసర్ శ్రీనివాస్‌గౌడ్, డీపీఎం సుధాకర్, సీ ఎస్‌వో నవీన్, సీపీవో మోజీ అహ్మద్, జిల్లా ఎయి డ్స్ నియంత్రణ సిబ్బంది, టీబీ నియంత్రణ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


