● రికార్డు స్థాయిలో ఆదాయం
● వాయిదా పడిన కూరగాయలు, సులభ్ కాంప్లెక్స్‌ల వేలం
నవీపేట: నవీపేట జీపీ పరిధిలో కొనసాగే మేకల సంతకు బుధవారం నిర్వహించిన వేలానికి రికార్డు స్థాయిలో రూ. కోటీ 2 లక్షల ఆదాయం వచ్చింది. సంత వేలంలో పాల్గొనేందుకు 159 మంది ఔత్సాహికులు రూ. లక్ష చొప్పున డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొన్నారు. సర్పంచ్ కేఎల్‌వీ రేఖ రాజేందర్‌గౌడ్, ఉప సర్పంచ్ నవీన్‌రాజ్, జీపీ పాలకవర్గం ఆధ్వర్యంలో వేలాన్ని నిర్వహించారు. గతేడాది ఈ సంతకు రూ. 61 లక్షల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది గణనీయంగా రూ. 41 లక్షల అదనపు ఆదాయం వచ్చింది. పాత గుత్తేదారు సిరాజుద్దీన్ రూ. కోటీ 2 లక్షలకు వేలాన్ని దక్కించుకున్నారు. అలాగే వారాంతపు కూరగాయలు, సులభ్ కాంప్లెక్సులకు నిర్వహించాల్సిన వేలం వాయిదా పడింది. పాడైన ఇనుప సామగ్రి, ఫర్నీచర్‌కు వేలం నిర్వహించగా రూ. 1,40,000 ఆదాయం వచ్చింది. వాయిదా పడిన వారాంతపు కూరగాయల సంత, సులభ్ కాంప్లెక్స్‌లకు మళ్లీ వేలం నిర్వహిస్తామని జీపీ కార్యదర్శి రవీందర్‌నాయక్ తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
● కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఇందల్వాయి: ఇందల్వాయి ఏకలవ్య గురుకులంలో ఖాళీగా ఉన్న పోస్టులను తాత్కాలిక పద్ధతిన అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. పీజీటీ కెమిస్ట్రీ (01), సైకాలజీ కౌన్సిలర్ (01), ఎంబీఏ రిటైలర్ (01), గార్డెనర్ (01), మెస్ హెల్పర్ (01), స్లీపింగ్ అండ్ శానిటేషన్ (02) పోస్టులకు ఈ నెల 20 నుంచి 25 తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. బీబీపూర్ తండాలోని ఈఎంఆర్‌ఎస్ గురుకులంలో దరఖాస్తులు అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు 9492357892, 9696623631 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.


