నిజామాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌

Mar 19 2026 7:34 AM | Updated on Mar 19 2026 7:34 AM

జిల్లాలో పామాయిల్‌ ఫ్యాక్టరీ
ఎస్సెస్సీ ప్రశ్నాపత్రం లీక్‌

అంగీకారం తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి

నిర్మాణం కోసం స్థల పరిశీలన

వ్యవసాయంతోపాటు పారిశ్రామిక

అభివృద్ధితో మేలు: సుదర్శన్‌రెడ్డి

గురువారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2026

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: వ్యవసాయ రంగంలో ముందంజలో ఉన్న జిల్లాలో అనుబంధ పరిశ్రమల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఆయిల్‌ పామ్‌ సాగు విస్తీర్ణం పెరిగేలా రైతులను అధికారు లు, ప్రజాప్రతినిదులు ప్రోత్సహిస్తుండగా, పామాయిల్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే అంగీకరించారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి అ వసరమైన స్థలాన్ని సేకరించేందుకు కసరత్తు ప్రారంభమైంది. ఇందులో భాగంగా మాక్లూర్‌ మండలంలో ని గుత్ప శివారులో ప్రభుత్వ స్థలాన్ని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఆర్మూర్‌ సబ్‌ కలెక్టర్‌ అభిగ్యాన్‌ మాల్వియా తో కలిసి సుదర్శన్‌రెడ్డి బుధవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయాధారిత పరిశ్రమల ఏర్పాటుతో రైతుల కు మరింత మేలు కలుగుతుందన్నారు. జిల్లా రైతులు ప్రస్తుతం 7వేల ఎకరాల్లో పామాయిల్‌ పంటను సాగు చేస్తున్నారని, మరో రెండేళ్లలో ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నారు. మరింతమంది రైతులు ఆయిల్‌పామ్‌ సాగువైపు మళ్లుతున్నారన్నారు. జిల్లాలో పామాయిల్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి అంగీకరించారని తెలిపారు. స్థలాన్ని ఖరారు చేయాల్సి ఉందన్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటైతే జిల్లాలో మరింతమంది రైతులు పామాయిల్‌ సాగుకు మొగ్గుచూపుతారన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల అవసరాలకు అనుగుణంగా 75 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్‌ సాగు చేయాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం పది శాతం విస్తీర్ణం లోపే పంట సాగు చేస్తున్నారన్నారు. దీంతో ఇతర దేశాల నుంచి వంట నూనెలు భారీగా దిగుమతి చేసుకోవాల్సి వస్తోందన్నారు. స్థానికంగా ఆయిల్‌పామ్‌ను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తే రైతులు అధిక లాభాలు ఆర్జించడంతోపాటు ప్రజల అవసరాలు సైతం తక్కువ ఖర్చుతోనే తీరుతాయన్నారు. పామాయిల్‌ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలతో కూడిన ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ రైతు ఖాతాలో జమ అవుతోందన్నారు. ఆయిల్‌పామ్‌ మొక్కలకు అయ్యే వ్యయంలో అధిక మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోందని, పంట దిగుబడి విక్రయం, ధర విషయంలో రైతులకు ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. మొక్కలు అందించిన కంపెనీలే, బోర్డు ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు పంట దిగుబడిని కొనుగోలు చేస్తాయన్నారు. ఎకరానికి సుమారు పది టన్నుల వరకు పామాయిల్‌ గెలల దిగుబడి వస్తుందని సుదర్శన్‌రెడ్డి తెలిపారు. అంతర పంటలను సైతం సాగు చేసుకుని రైతులు లాభాలు రెట్టింపు చేసుకోవచ్చన్నారు. ఎకరానికి కనీసం రూ.2 లక్షల ఆదాయం ఆర్జించొచ్చన్నారు.

స్థలాన్ని పరిశీలించిన అనంతరం సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలని అధికారులను సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. స్థల నిర్దారణ అయిన వెంటనే పామాయిల్‌ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. సుదర్శన్‌రెడ్డి వెంట రాష్ట్ర సహకార యూనియన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతిరెడ్డి రాజిరెడ్డి, నిజామాబాద్‌ ఆర్డీవో రాజేంద్రకుమార్‌, జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాస్‌, డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అసోసియేషన్‌ అధ్యక్షుడు రమణ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

ఖలీల్‌వాడి/పెర్కిట్‌: పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్‌ ఘటన కలకలంరేపింది. ఆలూర్‌, బోధన్‌, మెండోరాలోని సెంటర్ల నుంచి సెకండ్‌ లాంగ్వేజ్‌ తెలుగు, హిందీ ప్రశ్నాపత్రాలను లీక్‌ చేశారు. బుధవారం పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికి ప్రశ్నాపత్రాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆలూర్‌లో బయటి వ్యక్తులు జవాబులను రాసి పరీక్ష కేంద్రంలోకి పంపినట్లు తెలిసింది. ప్రశ్నాపత్రాలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైన వెంటనే డీఈవో అశోక్‌కుమార్‌ ఆయా సెంటర్లకు వెళ్లి విచారణ చేపట్టారు. కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు ఆలూర్‌ సెంటర్‌ సిబ్బంది రాజేందర్‌, విజయ్‌కుమార్‌, సాగర్‌, ఉమేందర్‌, మెండోరా సిబ్బంది మమత, రవీందర్‌, భూపతి, బోధన్‌ సిబ్బంది వేణు, శివానందరావులను సస్పెండ్‌ చేసినట్లు డీఈవో తెలిపారు.

సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైన సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌

ఆలూర్‌, బోధన్‌, మెండోరాలో ఘటన తొమ్మిది మంది సస్పెన్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement