వడగళ్ల వాన.. 1,520 ఎకరాల్లో పంట నష్టం | - | Sakshi
Sakshi News home page

వడగళ్ల వాన.. 1,520 ఎకరాల్లో పంట నష్టం

Mar 19 2026 7:34 AM | Updated on Mar 19 2026 7:34 AM

సాలూర, రుద్రూర్‌, వర్ని, పొతంగల్‌

మండలాల్లో దెబ్బతిన్న పంటలు

డొంకేశ్వర్‌/రుద్రూర్‌/వర్ని: జిల్లాలో మంగళవారం సాయంత్రం కురిసిన వడగళ్ల వానకు బోధన్‌ డివిజన్‌ పరిధిలో 1,520 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. వడగళ్ల ధాటికి వరి గింజలు నేలరాలాయి. మొక్కజొన్న పంట అడ్డంగా పడిపోయింది. సాలూర, పొతంగల్‌ మండలం కొల్లూర్‌, హెగ్డొలి, దొమలెడ్గి, టాక్లీ గ్రామాల్లో మొక్కజొన్న, రుద్రూర్‌ మండలం చిక్కడపల్లి, రాణంపల్లి, అంబం(ఆర్‌), కొందాపూర్‌, రుద్రూర్‌, అక్బర్‌నగర్‌లతోపాటు వివిధ గ్రామాల శివార్లలో వరికి నష్టం వాటిల్లింది. వర్ని మండలం తగిలేపల్లి, పాత వర్నిలో వడగల్లు కురిశాయి. వ్యవసాయ శాఖ బుధవారం పంట నష్టం లెక్కలను సేకరించగా.. మొత్తం 891మంది రైతులను బాధితులుగా గుర్తించారు. అంచనా నివేదికను వ్యవసాయాధికారులు కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి పంపించారు. అత్యధికంగా వరి 1,110 ఎకరాలు, మొక్క జొన్న 110 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు డీఏవో వీరాస్వామి వెల్లడించారు.

రుద్రూర్‌ 980

సాలూర 360

వర్ని 130

పొతంగల్‌ 50

మండలాల వారీగా పంటనష్టం (ఎకరాల్లో..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement