జాబ్‌మేళాకు అపూర్వ స్పందన | - | Sakshi
Sakshi News home page

జాబ్‌మేళాకు అపూర్వ స్పందన

Mar 18 2026 7:43 AM | Updated on Mar 18 2026 7:43 AM

కొనసాగుతున్న ఎంఈడీ పరీక్షలు

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఎంఈడీ 3వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ థీయరీ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్‌ ఆడిట్‌సెల్‌ డైరెక్టర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 29 మంది విద్యార్థులకు గానూ 28 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు.

ఘనంగా మహిళా దినోత్సవం

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ వర్సిటీలో మంగళవా రం తెయూ ఉమెన్‌ సెల్‌ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వీసీ యాదగిరిరావు ము ఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మహిళా చైత న్యం గ్రామాల నుంచే మొదలవ్వాలన్నారు. రిజిస్ట్రా ర్‌ యాదగిరి మాట్లాడుతూ.. సీ్త్ర, పురుషులు పరస్ప ర సహకారంతో ముందుకెళ్లినప్పుడే మంచి అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఉమెన్‌ సెల్‌ డైరెక్టర్‌ భ్ర మరాంభిక, ప్రిన్సిపాల్స్‌ రాంబాబు, సీహెచ్‌ ఆరతి, ప్రసన్నరాణి తదితరులు పాల్గొన్నారు.

లైబ్రరీకి పుస్తకాల అందజేత

తెయూ(డిచ్‌పల్లి): తెయూకు మంగళవారం డాక్టర్‌ విభూది వెంకటేశ్వర్లు రచించిన బేడ (బుడగ) జంగం ఇంగ్లీష్‌ వర్షన్‌ పుస్తకాలను అందజేశారు. నల్గొండ జిల్లా దిండి మండలానికి చెందిన డాక్టర్‌ వెంకటేశ్వర్లు ప్రస్తుతం పీఎంఆర్‌ లా కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన బహూకరించిన పుస్తకాలను తెయూ తెలుగు అధ్యయనశాఖ ప్రొఫెసర్‌ పి.కనకయ్య, లక్ష్మణ చక్రవర్తి యూనివర్సిటీ లైబ్రేరియన్‌కు అందజేశారు.

25న ‘సైబర్‌ హైజీన్‌ ప్రాక్టీసెస్‌’పై సదస్సు

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో ఈ నెల 25న ‘సైబర్‌ హైజీన్‌ ప్రాక్టీసెస్‌’ అవగాహన స దస్సు నిర్వహించనున్నట్లు తెయూ వీసీ యాదగిరిరావు అన్నారు. సదస్సును విద్యార్థులు సద్వినియో గం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా మంగళవారం వీసీ తన చాంబర్‌లో రిజిస్ట్రార్‌ యాదగిరితో కలిసి సదస్సు బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. సదస్సును కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ వర్సిటీ సమన్వయంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘వార్తాలాప్‌’ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ అవగాహన స దస్సు ఉదయం 10 గంటలకు వర్సిటీ కామర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల సెమినార్‌ లో ప్రారంభమవుతుందన్నారు.

వర్సిటీ హాస్టల్స్‌ తనిఖీ

తెయూ(డిచ్‌పల్లి): తెయూ మెయిన్‌ క్యాంపస్‌లోని హాస్టళ్లను మంగళవారం వీసీ యాదగిరిరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల తో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. హా స్టళ్లలో పరిశుభ్రతను మరింత మెరుగుపరచాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం నిరంతరం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రార్‌ యాదగిరి, కంట్రోలర్‌ సంపత్‌కుమార్‌, ప్రిన్సిపాల్‌ రాంబాబు, హాస్టల్స్‌ చీఫ్‌ వార్డెన్‌ రవీందర్‌రెడ్డిలతో కలిసి వీసీ భోజనం చేశారు. వార్డెన్లు గంగాకిషన్‌, కిరణ్‌, కేర్‌టేకర్లు క్రాంతి, డిగంబర్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement