ఎండకు ఎదురెళ్లొద్దు! | - | Sakshi
Sakshi News home page

ఎండకు ఎదురెళ్లొద్దు!

Mar 18 2026 7:43 AM | Updated on Mar 18 2026 7:43 AM

జాగ్రత్తలు పాటించాలి..

వేసవికాలంలో ఆరోగ్యంపై

ప్రత్యేక శ్రద్ధ అవసరం

ప్రజలు తగిన జాగ్రత్తలు

పాటించాలంటున్న వైద్యనిపుణులు

నిజామాబాద్‌ రూరల్‌: వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఇంతటి ఎండల్లో తి రిగితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంద ని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. హీట్‌ స్ట్రోక్‌తో పాటు విరేచనాలు (డయేరియా), పచ్చ కామెర్లు (జాండిస్‌) వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కు వగా ఉంటుందని తెలిపారు. వేసవి కాలంలో చిన్న జాగ్రత్తలతోనే పెద్ద ఆరోగ్య సమస్యలను నివారించ వచ్చని సూచిస్తున్నారు. ఈనేపథ్యంలో ఎండాకా లంలో ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని పేర్కొంటూ.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూ చనలు తెలియజేశారు.

● రోజుకు కనీసం 3–4 లీటర్ల నీరు తాగాలి.

● శుభ్రమైన, మరిగించిన లేదా ఫిల్టర్‌ చేసిన నీటిని మాత్రమే ఉపయోగించాలి.

● చిన్నపిల్లలు గర్భిణులు, బాలింతలు ఎండలో బయటకు వెళ్లరాదు.

● బయటకు వెళ్తే తలకు టోపి (క్యాప్‌/టవల్‌) ఉపయోగించాలి.

● ఉదయం 8 గంటల నుంచి 11 గంటలలోపు ఇంట్లోకి చేరుకుకోవాలి.

● మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు బయట తిరగకుండా ఉండాలి.

● సాయంత్రం 4గంటల తరువాతనే బయటకు వెళ్లడం శ్రేయస్కరం.

● తేలికపాటి, పలుచని, తెల్లని దుస్తులు ధరించాలి.

● కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవాలు ఎక్కువ తీసుకోవాలి.

● బయట ఆహారం, అపరిశుభ్రమై న ఆహారం తీసుకోవడం పూర్తిగా నివారించాలి.

● చేతులు తరచూ కడుక్కోవాలి, పరిశుభ్రత పాటించాలి.

● పిల్లలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

● వాంతులు, విరేచనాలు, జ్వరం లేదా కళ్లు/చర్మం పసుపు రంగులో మారడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

● ఉదయం అత్యవసర సమయంలో బయటకు వెళ్తే గొడుగు తప్పని సరిగావాడాలి.

ఎండాకాలంలో జాగ్రత్తలు పాటిస్తే సంపూర్ణ అరోగ్యం అభిస్తుంది. ముఖ్యంగా ఎండాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వడదెబ్బ తగిలితే వెంటనే దగ్గర్లో ఉన్న వైద్యుడిని సంప్రదించాలి. ఓఆర్‌ఎస్‌ ద్రావణంతోపాటు మజ్జిగ, నిమ్మరసాలు, శీతల పానియాలు తాగాలి. ఎండలో ఎక్కవగా తిరుగకుడదు. –ఆనంద్‌ మాలు,

జనరల్‌ ఫిజీషియన్‌, మెడికవర్‌ హాస్పిటల్స్‌, నిజామాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement