ఆర్మూర్‌టౌన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని వారంతపు సంత, రోజువారి తైబజార్‌కు ఈనెల 25న వేలంపాటను మున్సిపల్ చైర్‌పర్సన్ గోనె లహరి, మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు నిర్వహించనున్నట్లు మున్సిపల్ ఆర్వో ఉమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. వారపు సంత (అంగడి), రోజువారి తైబజార్ కాంట్రాక్టు 01–04–2026 నుంచి 31–03–2027 వరకు ఇచ్చేందుకు నిర్ణయించడమైందన్నారు. వేలంలో పాల్గొనేవారు ఈనెల 17 నుంచి 24 వరకు మున్సిపల్ కమిషనర్ పేరు మీద రూ.5లక్షల డీడీ తీసి అందజేయాలన్నారు. వేలంపాటకు సంబంధించిన నిబంధనలు నోటీసు బోర్డుపై ఉన్నాయన్నారు.
ఖలీల్‌వాడి : జిల్లాలో నేటి నుంచి ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం అవుతుందని, సంబంధిత సబ్జెక్టుల అధ్యాపకులు వెంటనే రిపోర్టు చేయాలని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, అన్ని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ వారి కళాశాల లాగిన్‌లలో అధ్యాపకుల అపాయింట్‌మెంట్ ఆర్డర్‌లు ఇంటర్ బోర్డు నిక్షిప్తం చేసిందన్నారు. మూల్యాంకన విధులు ఉన్న ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, హిస్టరీ సబ్జెక్టు అధ్యాపకులను రిలీవ్ చేయాలని, ఎవరైనా రిలీవ్ చేయని ప్రిన్సిపాల్స్, ప్రైవేటు యాజమాన్యంపై ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఖలీల్‌వాడి: ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనంలో విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులకు రానున్న ఉగాది, రంజాన్ పండుగలకు మూల్యాంకనంలో ‘నో వర్క్ నో పే‘ అమలు చేయాలని ప్రభుత్వ అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సయ్య, ఇతర ప్రతినిధులు కోరారు. ఈమేరకు వారు జిల్లా ఇంటర్ విద్య అధికారి రవి కుమార్‌కు, హైదరాబాద్ నుంచి వచ్చిన ఇంటర్ విద్య పర్యవేక్షకులకు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. వినతి పత్రాన్ని వెంటనే ఇంటర్ బోర్డు కమిషనర్‌కు, పరీక్షల నిర్వహణ విభాగానికి పంపిస్తామని జిల్లా ఇంటర్ విద్యా అధికారి, పర్యవేక్షకులు తెలియజేశారు.
నిజామాద్ రూరల్: ఏప్రిల్ 2న హనుమాన్ జ న్మోత్సవం సందర్భంగా నిర్వహించనున్న శో భాయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ విశ్వహిందూపరిషత్ ప్రతినిధులు కోరారు. ఈమేర కు వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు దినేష్ ఠాకూర్ మంగళవారం నగరంలోని సీపీ సాయిచైతన్య ను ఆయన చాంబర్‌లో కలిసి, వినతిపత్రం అందజేశారు. ఇందూరు నగరంతోపాటు, అర్మూ ర్, బోధన్‌లలో హనుమాన్ శోభాయాత్ర ని ర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే అడిషనల్ డీజీపీ బస్వారెడ్డిని కలిసి మెమోరాండం ఇ చ్చారు. వీహెచ్‌పీ ప్రతినిధులు తమ్మలా కృష్ణ, గాజుల దయానంద్, ధాత్రిక రమేష్, దాసరి సాయి ప్రసాద్, అనిల్ కధం, రామ్ ప్రసాద్ చటర్జీ, నాంపల్లి శేఖర్, బాసొల్లా నీకేష్, గజానన్ పాల్గొన్నారు.
నవోదయ ఫలితాల్లో
జిల్లా టాపర్ లేక్షణ
డొంకేశ్వర్(ఆర్మూర్): నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాలు మంగళవారం వెలువడగా.. డొంకేశ్వర్ మండలం జీజీ నడ్కుడకు చెందిన రాజారాం లేక్షణ 95శాతం మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచింది. నూత్‌పల్లిలోని సాయి ప్రసన్న పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న లేక్షణ ఇటీవల నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష రాసింది. ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు రావడంతో తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులు లేక్షణను అభినందిస్తున్నారు.


