దరఖాస్తుల ఆహ్వానం
డిచ్‌పల్లి: మండలంలోని ఘన్‌పూర్ గ్రామ పంచాయతీ భవనంలో ఉన్న సెట్విన్ (యూత్ సర్వీస్ డిపార్ట్‌మెంట్) ఆధ్వర్యంలో కంప్యూటర్, టైలరింగ్‌లో శిక్షణ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సెంటర్ కోఆర్డినేటర్ అబ్రార్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆసక్తి గల విద్యార్థులు ఆధార్, ఎస్సెస్సీ జిరాక్స్‌తోపాటు, ఫొటోలతో దరఖాస్తులను సెట్విన్ కార్యాలయంలో అందజేయాలని కోరారు. ఎంఎస్ ఆఫీస్, డీటీపీ కోర్సులకు మూడు నెలలకు రూ.12,00 లు, టాలీ కోర్సుకు మూడు నెలలకు రూ.1,600లు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని కో–ఆర్డినేటర్ తెలిపారు. అలాగే టైలరింగ్ మూడు నెలలకు రూ.1600 లు ఫీజు చెల్లించాలన్నారు. కోర్సు పూర్తయిన తర్వాత పరీక్ష నిర్వహించి ప్రభుత్వ సర్టిఫికెట్ ఇస్తారని తెలిపారు. మరిన్ని వివరాలకు 89858 64424, 97000 07149ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.


