కాసర్లకు ధర్మనిధి పురస్కారం
నిజామాబాద్ రూరల్: జిల్లాకు చెందిన కవి కాసర్ల నరేష్ రావు తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ధర్మనిధి పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రా రావు చేతుల మీదు ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. పరిషత్ అధ్యక్షుడు శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి చెన్నయ్య, కవులు తిరుమల శ్రీనివాసాచార్య, గోపగాని రవీందర్, తుమ్మల దేవారావు, మంత్రి రామారావు, డాక్టర్ కమలాకర శర్మ, సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


