● సొమ్మసిల్లిన మున్సిపల్
మహిళా కార్మికులు
● సమస్యలు పరిష్కరించాలని ధర్నా
నిజామాబాద్ రూరల్: సమస్యలను పరిష్కరించాలని, కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులు(సీఐజీ)లను య థావిధిగా కొనసాగించాలని, ఏజెన్సీలను రద్దుచేసి, కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాలని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు డిమాండ్ చేశా రు. సమస్యల పరిష్కారం కోసం టీయూసీఐ, ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మంగళవారం చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. కార్మికులు, డ్రైవర్లు పాత మున్సిపల్ కార్యాలయం నుంచి కోర్టు చౌరస్తా నుంచి కార్పొరేషన్ కార్యా ల యం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా వచ్చిన కార్మికులను పోలీసులు మున్సిపల్ కార్యాలయంలోకి రానివ్వకపోవడంతో ఒక్కసారిగా చొచ్చు కు వెళ్లారు. అనంతరం కమిషనర్ చాంబర్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీ యూసీ ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేశ్‌బాబు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఓమయ్య, డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడారు. ఉగా ది, రంజాన్ పండుగల నేపథ్యంలో బుధవారం సా యంత్రంలోగా కార్మికులకు జీతాలు ఇవ్వాలన్నారు. అ వుట్‌సోర్సింగ్ కార్మికులందరికీ యూనిఫామ్, స బ్బులు, నూనెలు, రక్షణ పరికరాలు ఇవ్వా లని, చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ స భ్యులకి ఉద్యోగ అవకాశం ఇవ్వడంలో కొర్రీలు పెట్టడం మానుకోవాలన్నారు. కేటగిరీల వారీగా ఇ తర మున్సిపల్ కార్పొరేషన్‌లలో ఇస్తున్నట్లు వేతనా లు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్‌ఐలలో తప్పులను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. సమస్యలను 14 రోజుల్లో పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్తామన్నారు.
మున్సిపల్ కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ కమిషనర్ రవీందర్‌సాగర్‌కు వినతిపత్రం అందజేశారు. ధర్నా కొనసాగుతున్న క్ర మంలో తోపులాట చోటుచేసుకోవడంతో మాధవి, పార్వతి అనే మహిళా కార్మికులు సొమ్మసిల్లి పడిపోయారు. తోటి కార్మికులు వారిని వెంటనే అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు భూపతి, రాజేశ్వర్, కిరణ్, గోవర్ధన్, రవి, శివకుమార్, భానుచందర్, మహేశ్, యాదమ్మ, లక్ష్మి, శైలజ, మున్సిపల్ కార్మికులు, డ్రైవర్లు టీయూసీఐ జిల్లా నాయకులు కిరణ్, లింగం, ఏఐటీయూసీ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.


