● ఫలించిన ఎంపీ అర్వింద్ కృషి
ఖలీల్‌వాడి: నిజామాబాద్, బోధన్ కేంద్రీయ విద్యాలయాల్లో 2026 – 27 విద్యా సంవత్సరానికి అదనపు సెక్షన్లు మంజూరయ్యాయి. బోధన్ కేవీలో 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు, నిజామాబాద్ కేవీలో 3 నుంచి 5వ తరగతి వరకు అదనపు సెక్షన్లు ఎంపీ అర్వింద్ కృషితో మంజూరయ్యాయి. అలాగే ఈ విద్యా సంవత్సరం నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయానికి ఇంటర్ ప్రథమ సంవత్సరం(సైన్స్)కి సైతం అనుమతి లభించింది. రెండు కేంద్రీయ విద్యాలయాల్లోనూ అదనపు సిబ్బందిని నియమించనున్నారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. అదనపు సెక్షన్ల మంజూరు చేయాలని కేంద్ర మంత్రితోపాటు ఉన్నతాధికారులకి గతంలో తాను విన్నవించానని, ఈ సంవత్స రం నుంచి అదనపు సెక్షన్లు మంజూరవడం ఆనందంగా ఉందన్నారు. జిల్లా విద్యార్థుల కు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అలా గే కేవీల్లో సౌకర్యాల విస్తరణ కోసం తన ప్ర యత్నాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
అటవీ సిబ్బందికి ముగిసిన అవగాహన తరగతులు
● హాజరైన తొమ్మిది జిల్లాల సిబ్బంది
డొంకేశ్వర్(ఆర్మూర్): మూడు జిల్లాల సరిహద్దులో పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో తొమ్మిది జిల్లాల ఫారెస్ట్ సిబ్బందికి నిజామాబాద్ అటవీ కార్యాలయంలో రెండు రోజులపాటు నిర్వహించిన అవగాహన తరగతులు మంగళవారం ముగిశాయి. పుణే నుంచి వచ్చిన మగ్గురు రెసూ్‌క్య్ టీం వన్యప్రాణుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్య లు, జాగ్రత్తలను వివరించారు. నిజామాబాద్‌తోపాటు జగిత్యాల, నిర్మల్, అదిలాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట్, కరీంనగర్ జిల్లాల నుంచి వచ్చిన బీట్, సెక్షన్ ఆఫీసర్లతోపాటు ఎఫ్‌ఆర్వోలు, ఎఫ్‌డీవోలు, డీఎఫ్‌వోలు పాల్గొన్నారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నీలకంఠరావు
● 26న మిగతా పదవులకు ఎన్నికలు
నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా డి నీలకంఠరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే జాయింట్ సెక్రెటరీగా ఏ మానస, లైబ్రరీ సెక్రెటరీగా బి పుణ్యరాజ్, ట్రెజరర్‌గా జి మధుసూదన్‌గౌడ్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రెటరీగా బి గణేశ్, మహిళా రిప్రజెంటేటివ్‌గా ఝాన్సీరాణితోపాటు, తొమ్మిది మంది ఈసీ మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారులు అమిడాల సుదర్శన్, మెట్టు నరేశ్‌కుమార్ ప్రకటించారు. ఉపాధ్యక్ష పదవితోపాటు ప్రధాన కార్యదర్శి పదవులకు ఈనెల 26వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు.


