పచ్చి పసుపు తీసుకొచ్చి నష్టపోవద్దు | - | Sakshi
Sakshi News home page

పచ్చి పసుపు తీసుకొచ్చి నష్టపోవద్దు

Mar 18 2026 7:42 AM | Updated on Mar 18 2026 7:42 AM

ఈ నెల 23 నుంచి

అమలులోకి గ్రేడింగ్‌ విధానం

నిజామాబాద్‌ ఏఎంసీ చైర్మన్‌

ముప్ప గంగారెడ్డి

నిజామాబాద్‌ రూరల్‌: రైతులు పచ్చి పసుపు మార్కెట్‌ యార్డుకు తీసుకువచ్చి నష్టపోవద్దని నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముప్ప గంగారెడ్డి సూచించారు. మార్కెట్‌ యార్డు లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. అకాల వర్షాల కారణంగా పసుపు ధర మరింత తగ్గుతుందనే భయంతో రైతులు పెద్ద ఎత్తున పచ్చి పసుపు తీసుకువస్తుండడంతో మోడల్‌ ధరలో రూ.500 నుంచి రూ.800 వరకు తగ్గుదల గమనించామన్నారు. ధరల తగ్గుదల, పచ్చి పసుపు విక్రయాలను నివారించేందుకు మార్కెట్‌ యార్డులో ఈ నెల 23వ తేదీ నుంచి గ్రేడింగ్‌ విధానాన్ని అమలు చేస్తామన్నారు. పూర్తిగా ఎండబెట్టిన పసుపును మా ర్కెట్‌ యార్డుకు తీసుకురావాలని రైతులను కోరా రు. అలాగే అమావాస్య, ఉగాది, రంజాన్‌ కారణంగా 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మార్కెట్‌ యార్డులో లావాదేవీలు కొనసాగవని, 23వ తేదీ నుంచి యథావిధిగా క్రయవిక్రయాలు సాగుతాయ ని నగేశ్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement