నిజామాబాద్ రూరల్: జిల్లాకేంద్రంలో ఈనెల 21న బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కలెక్టరేట్ ముట్టడికి ప్రజలు పెద్దఎత్తున పాల్గొని, జయప్రదం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్‌పటేల్ కులాచారి పిలుపునిచ్చారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను నిలబెట్టడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయన్నారు. అయినా ప్రభుత్వ సలహాదారులు, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లకు ప్రజల మీద పట్టింపు లేదన్నారు. అన్ని సమస్యలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి కలెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతనకర్ లక్ష్మినారాయణ, నాగోల్ల లక్ష్మినారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు ప్రమోద్‌కుమార్, బంటు రాము, నిమ్మల శ్రీనివాస్, బాన్సువాడ ఇన్‌చార్జి కోనేరు శశాంక్, రూరల్ కన్వీనర్ పద్మరెడ్డి, జిల్లా కార్యదర్శిలు దాంపల్లి జ్యోతి, పోల్కం వేణు, పాలేపు రాజు, బద్దం కిషన్, పుట్ట వీరేందర్, జగన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, విజయ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు


